Vastu Tips for Main Door :చాలా మంది ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల అమరిక వరకు వాస్తును బలంగా నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లోని ప్రధాన ద్వారమైన మెయిన్ డోర్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను తప్పక పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మెయిన్ డోర్ విషయంలో చేసే కొన్ని పొరపాట్లు కారణంగా వాస్తుదోషాలు తలెత్తి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందంటున్నారు. అలా జరగొద్దంటే.. మెయిన్‌డోర్ విషయంలో ఈ వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. తద్వారా.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని.. మీ ఇల్లు ఎలాంటి గొడవలు లేకుండా ఆనందమయంగా మారుతుందంటున్నారు వాస్తు పండితులు. ఇంతకీ.. ప్రధాన ద్వారం(Main Door)ఎలా ఉంచుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మామిడి ఆకులు వేలాడదీయాలి :ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే అందుకు వాస్తుదోషం కూడా కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఇలాంటి టైమ్‌లో ఇంటి ప్రధాన ద్వారానికి పూలు కట్టాలని చెబుతుంటారు. అదేవిధంగా మెయిన్ డోర్‌కు మామిడి ఆకులను కట్టడం కూడా ఇంటికి మేలు జరుగుతుందంటున్నారు. అలాగే.. తలుపు మీద దేవుని ఫోటోను చెక్కించడం లేదా అతికించడం మంచిది అంటున్నారు. ఇలా ఉండటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందని తెలియజేస్తున్నారు.
రెండు చేతులతో డోర్ ఓపెన్ చేయండి : ఈరోజుల్లో చాలా మంది ఇంటి ప్రవేశ ద్వారాలకు రెడిమేడ్ డోర్స్ యూజ్ చేస్తున్నారు. అలాకాకుండా మెయిన్ డోర్‌ను సీసం లేదా వేప, గంధం వంటి చెక్కతో తయారుచేయించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు. అదేవిధంగా, వాస్తుప్రకారం.. ఇంటికి వచ్చినప్పుడల్లా రెండు చేతులతో డోర్ ఓపెన్ చేయడం మంచిది అంటున్నారు.
వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే!