Vastu For Happiness In Home :ఇంట్లో కంటికి కనిపించని కొన్ని శక్తి పుంజాల ప్రభావం ఎప్పుడూ పని చేస్తున్నట్లైతే ఆ ఇంట్లో నివసించే వారు చేసే ప్రతి పనిలోనూ విజయం కలగడమే కాకుండా, వారి ఆలోచనా విధానం కూడా ఎంతో ప్రభావంతంగా ఉంటుంది. వాస్తు పండితులు ఈ శక్తి పుంజాలనే బయో మాగ్నెటిక్ సిద్ధాంతం అంటారు.
బయో మాగ్నెటిక్ సిద్ధాంతం లేకుంటే నైరాశ్యమే!
ఇంట్లో బయో మాగ్నెటిక్ అంటే అతీంద్రియ శక్తులు లేకపోతే ఆ ఇంటి యజమాని, ఇంటి ఇల్లాలు ఎప్పుడూ నైరాశ్యం, నిరాశ, నిస్పృహలతో బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, ప్రతి పనిని వాయిదా వేస్తూ పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
శక్తి పుంజాలు చురుగ్గా ఉంటేనే ఉత్సాహం, ఉల్లాసం
ఒక ఇంట్లో నివసించే వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, ఏ పని చేయడానికైనా ముందడుగు వేస్తూ విజయాల మీద విజయాలు సాధించాలంటే కంటికి కనిపించని శక్తి పుంజాలు చురుగ్గా పని చేసి తీరాలి.
శక్తి పుంజాలు చురుగ్గా ఉండటానికి ముఖ్య సూత్రాలు
పరిశుభ్రతే ప్రధానం - ఇంట్లో శక్తి పుంజాలు చురుగ్గా ఉండాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండి తీరాల్సిందే! ఇంట్లో పనికిరాని వస్తువులు ఎప్పటికప్పుడు బయట పడేస్తూ ఉండాలి.
- వృక్షో రక్షతి రక్షితః - ఇంట్లో చిన్నవో, పెద్దవో మొక్కలు పెంచుకోవాలి. అంతే కాకుండా పెంచుకున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. మొక్కలకు రోజూ నీళ్లు పోయాలి.
- ఇంట్లో ఇవి ఉంటే సానుకూలత - ఇంట్లో ఎప్పటికీ ఎండిపోని, కుళ్లిపోని వస్తువులను ఎవరైతే ఉంచుకుంటారో వారి ఇంట్లో కంటికి కనిపించని సానుకూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
- ఇంట్లో రుణధ్రువ శక్తి ఉంటే తీరని అప్పులు- కొన్ని ఇళ్లలో రుణధ్రువ శక్తి తిష్ట వేసుకుని ఉంటుంది. అలాంటి ఇంట్లో నివసించే వారికి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి.
- రుణధ్రువ శక్తిని ఇలా తరిమి కొట్టవచ్చు - రుణధ్రువ శక్తి ఇంట్లో నుంచి పోవాలంటే ఇంట్లో ఎప్పుడూ అనిర్వచనీయమైన మంచి అనుభూతులు కలగాలి. అలా కలగాలంటే ఇంట్లో పొద్దున్నే కనీసం రెండు నిమిషాలపాటు నాదస్వరం మారుమోగాలి. నాదస్వరం ప్రతినిత్యం మారుమోగో ఇంట్లో మానసిక శాంతి, మంచి ఆరోగ్యం కలుగుతాయి.
- పెద్దలకు నమస్కారం మన సంస్కారం - ఇంటి యజమాని, ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉండే పెద్దలకు రోజూ నమస్కరించి ఆశీర్వాదాలు అందుకోవాలి. ఒకవేళ వాళ్లు దూరంగా ఉన్నా, ఫోన్లో మాట్లాడి అయినా వారి యోగక్షేమాలు కనుక్కుని, ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా చేసే వారి ఇంట్లో ఎప్పుడూ కంటికి కనిపించని శక్తి పుంజాల ప్రభావం వల్ల వారు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళతారు.
- పితృదేవతలకు నమస్కారం - రోజూ ఉదయం నిద్ర నుంచి లేవగానే పితృదేవతలకు మనసులో నమస్కరించుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం. ఇందువల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఆ ఇల్లు ఎప్పుడూ ధన కనక వస్తు వాహనాలతో విలసిల్లుతుంది. ఈ విధి విధానాలు ఎవరైతే పాటిస్తారో ఆ గృహమే స్వర్గసీమ అవుతుంది!
ముఖ్యగమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
తిరుమల బాలాజీకి తలనీలాలే ఎందుకు ఇస్తారు? దీని వెనుక కథేంటో తెలుసా? - why do we offer hair at tirupati
లక్ష్మీదేవికి 108 రూపాయి నాణేలతో పూజ- శుక్రవారం రోజు మహిళలు ఇలా చేస్తే కనక వర్షమే! - Ways To Attract Goddess Lakshmi