ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / spiritual

తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? - డిసెంబర్​ కోటా టికెట్లు సిద్ధం చేసిన టీటీడీ - ttd online booking

TTD Online Booking : టీటీడీ ఆన్​లైన్​ టికెట్​ బుకింగ్ డిెసెంబర్​ నెలకు సంబంధించిన షెడ్యూల్​ విడుదలైంది. ఈ నెల 20 నుంచి బుకింగ్ ప్రారంభం కానుండగా రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు గదుల బుకింగ్ తేదీలను సైతం టీటీడీ ప్రకటించింది.

ttd_online_tickets_booking
ttd_online_tickets_booking (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 3:02 PM IST

TTD Online Ticket Bookings: ఇష్టదైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా? డిసెంబర్ నెల కోటాకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జారీకి టీటీడీ షెడ్యూలు విడుదల చేసింది. దర్శనం టికెట్లు ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీ డిప్‌, తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటా షెడ్యూల్​ కూడా ప్రకటించింది.

భక్తుల సౌకర్యార్థం టీటీడీ డిసెంబరు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీ డిప్‌ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకున్న భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాలి.

'తిరుమలలో అక్కడ స్నానం చేస్తే మోక్షప్రాప్తి'- 'శ్రీవారి కంటే ముందుగా ఆయనకే నైవేద్యం' - Adivaraha Kshetram

డిసెంబర్ నెలకు సంబంధించి ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లు, 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక డిసెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.

డిసెంబరు నెలకు సంబంధించి తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవా కోటా మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేస్తారు. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

శ్రీవారి భక్తులకు అద్భుతమైన శుభవార్త - తిరుపతి లడ్డూ మీ ఊళ్లోనే లభిస్తుంది! - TTD Srivari Laddus to Devotees

అక్టోబర్​ 4 నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు - అధికారులతో ఈవో సమీక్ష - Tirumala Salakatla Brahmotsavam

ABOUT THE AUTHOR

...view details