తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సూర్యనారాయణుడిగా శ్రీవారు- సూర్యప్రభ వాహనంపై విహరించేది అందుకే!

తిరుమల బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు -సూర్యప్రభ వాహన వాహన విశిష్టతలు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Tirumala Sri Vari Bramhotsavalu Day 7
Tirumala Surya Prabha Vahanam (Getty Images)

Tirumala Sri Vari Bramhotsavalu Day 7 : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమీయనున్నాడు. ఈ సందర్భంగా సూర్యప్రభ వాహన విశిష్టతను తెలుసుకుందాం.

సప్తమి - సూర్యప్రభ వాహనం
హిందూ సంప్రదాయం ప్రకారం సప్తమి తిధి సూర్యభగవానుని ఆరాధనకు శ్రేష్టమైనది. అక్టోబర్ 10 వ తేదీ గురువారం సూర్యోదయ సమయాన ఆశ్వయుజ సప్తమి తిథి ఉన్నందున శ్రీనివాసునికి సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది.

శ్రీనివాసుడే సూర్యనారాయణుడు
వజ్ర కవచం ధరించి ఉదయ భానుని కిరణాలు ప్రసరిస్తుండగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ సూర్య మండలం మధ్యనున్న నారాయణ మూర్తిని నేనేనని భక్తులకు ప్రభోదించడమే ఈ వాహనసేవ పరమార్ధం.

ఆరోగ్య ప్రదాత
సనాతన హైందవ సంప్రదాయంలో సూర్యారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణుని ఆదిమధ్యాంత రహితుడిగా పేర్కొంటారు. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

సూర్యప్రభ వాహన దర్శన ఫలం
సూర్యప్రభ వాహనంపై ఉండే దేవదేవుని ప్రత్యక్షంగా దర్శించిన భక్తకోటికి రాజ్యాంగపరమైన అధికారాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. అలాగే సూర్యప్రభ వాహనాన్ని కనులారా వీక్షించిన వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాని శాస్త్రం చెబుతోంది.

సూర్యప్రభ వాహనంపై ఊరేగే శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details