తెలంగాణ

telangana

"ఇంట్లోని ఈ ప్రదేశాల్లో 'స్వస్తిక్' గుర్తు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహాం పొంది ధనవంతులవుతారు"!! - Rules for Drawing Swastik Sign

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

Swastik Symbol Importance: హిందూ సంప్రదాయంలో ఓంకారం తరువాత అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం.. స్వస్తిక్. అయితే, ఈ గుర్తును ఇంట్లోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో గీయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ, ఈ గుర్తు ఎక్కడ ఉంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

Rules for Drawing Swastik Sign
Swastik Symbol Importance (ETV Bharat)

Rules for Drawing Swastik Sign in Astrology:స్వస్తిక్.. ఇది చాలా శక్తివంతమైన సింబల్. ఇంట్లో ఈ గుర్తు ఉంటే.. క్షేమాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. బ్రహ్మదేవుడితో పాటు స్వస్తిక్ గుర్తు పుట్టిందని పురాణాల్లో చెబుతుంటారు. అయితే.. ఈ గుర్తు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఈ ప్రదేశాల్లో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ.. స్వస్తిక్ సింబల్ ఉండాల్సిన ప్రదేశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మొట్టమొదటగా మీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు. లేదంటే.. అందుకు సంబంధించిన స్టిక్కర్ మెయిన్ ఎంట్రెన్స్ మీద అతికించినా చాలా మంచిదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్. అలా చేయడం ద్వారా ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయట.

అలాగే.. ఇంట్లో తలుపుల మీద ఈ గుర్తులు ఉన్నా, స్టిక్కర్​లు అతికించినా లక్ష్మి కటాక్షం కలుగుతుందంటున్నారు. అదేవిధంగా.. ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసినా.. స్టిక్కర్ అతికించినా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వృథా ఖర్చులు తగ్గిపోతాయట.

డబ్బు దాచుకునే బీరువా మీద కూడా ఈ గుర్తు ఉండడం చాలా మంచిదంటున్నారు. కాబట్టి.. బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్నా, స్టిక్కర్ అతికించినా వృథా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుందంటున్నారు.

అదేవిధంగా.. పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఆ గదిలోని గోడపైన ఎర్రటి గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదమని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. లేదంటే.. అందుకు సంబంధించి స్టిక్కరైనా అతికించుకోవాలంటున్నారు.

వంటగదిలోనూ ఈ గుర్తు ఉండేలా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా.. కిచెన్​లో గ్యాస్ స్టౌ ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఆపై దానికి నాలుగు వైపులా కుంకుమ బొట్టు పెట్టి.. రెండు నిలువు గీతలు ఎడమ వైపు, మరో రెండు గీతలు కుడి వైపు పసుపుతో గీసినట్లయితే.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవిస్తుందంటున్నారు. అంటే.. ధాన్యానికి, ఆహారానికి గానీ ఎలాంటి లోటు ఉండదట.

కాబట్టి.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ ప్రత్యేకమైన ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో ఆ ఇల్లు వర్థిలుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

అదేవిధంగా.. ఇంటికి ఆగ్నేయం దిశ చాలా ముఖ్యమైనది. ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు. లక్ష్మీదేవి ఎప్పుడూ అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం "శ్రీం". కాబట్టి.. ఇంట్లో ఆగ్నేయ మూలలో కుంకుమతో "శ్రీం" అనే అక్షరం రాయండి. ఆ ఇంట్లో వృథా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుందంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

"అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టాలంటే - సోమవారం ఈ పనులు అస్సలు చేయకూడదట"

"మహిళలు ఈ పనులు చేస్తే - భర్త సంపాదన భారీగా పెరిగిపోతుంది!"

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details