తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కడుతున్నారా? - ఈ రోజుల్లో కడితేనే విశేష ఫలితాలు!

-బూడిద గుమ్మడికాయ కట్టే విషయంలో పాటించాల్సిన నియమాలు - ఆ సమయంలో కడితే ఎటువంటి ఫలితాలు లభించవు

Rules for Ash Gourd Tying
Rules for Ash Gourd Tying In Front of Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Rules for Ash Gourd Tying In Front of Home: కొత్త ఇళ్లు కట్టుకున్నప్పుడు లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు.. ఇంటిముందు, దుకాణాల ముందు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు. ఇలా గుమ్మడికాయలను ఇంటి ముందు కట్టడం వల్ల నరదిష్టి పోతుందని.. ఏమైనా సమస్యలు ఉన్నా తొలిగిపోతాయని కడుతుంటారు. అయితే వీటిని కట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఇంతకీ ఆ నియమాలు ఏంటి? దిష్టి గుమ్మడికాయను ఏ రోజున? ఏ సమయంలో కట్టాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బూడిద గుమ్మడికాయ విషయంలో పాటించాల్సిన నియమాలు:

కడగొద్దు: సాధారణంగా గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మంచి గుమ్మడికాయ ఒకటి.. బూడిద గుమ్మడికాయ రెండోది. మంచి గుమ్మడిని కూరల్లో ఉపయోగిస్తే.. బూడిద గుమ్మడిని దిష్టి పోవడానికి ఇంటి ముందు కడుతుంటారు. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టేటప్పుడు చాలా మంది చేసే తప్పు గుమ్మడికాయను కడగడం. అవును గుమ్మడి బూడిదగా ఉందని చాలా మంది దానిని శుభ్రం చేస్తుంటారు. కానీ ఇలా చేయవద్దని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయను ఎట్టి పరిస్థితులలో కడగకూడదని అంటున్నారు. కేవలం దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలని సూచిస్తున్నారు. కడగడం వల్ల దానికున్న పవర్​ మొత్తం పోతుందని అంటున్నారు.

అలా చేయొద్దు: చాలా మంది బూడిద గుమ్మడికాయను తొడిమతో లేపి పట్టుకుంటుంటారు. ఈ క్రమంలో అది ఊడిపోతుంది. అయినా కానీ అలానే కట్టేస్తుంటారు. అయితే గుమ్మడిని తొడిమతో లేపి పట్టుకోకూడదని చెబుతున్నారు మాచిరాజు. ఇలా పట్టుకున్నప్పుడు అది ఊడిపోతే దానికున్నా శక్తులన్నీ పోతాయని.. తొడిమ లేకపోయినా ఇంటి ముందు కడితే ఎటువంటి ఫలితాలు ఉండవని సూచిస్తున్నారు.

అలా పట్టుకోవద్దు: మార్కెట్​ నుంచి తెచ్చేటప్పుడు చాలా మంది తెలిసీ తెలియక బూడిద గుమ్మడికాయని తిరగేసి పట్టుకుంటుంటారు. అంటే కాయ పై భాగంలో, తొడిమ కింది భాగంలో ఉండేలా చూసుకుంటుంటారు. అయితే ఇలా ఎట్టి పరిస్థితులలో కూడా కాయని తిరగేసి పట్టుకోకూడదని చెబుతున్నారు. ఇలా కాడను కిందకు వచ్చేలా పట్టుకుంటే.. నెగిటివ్​ ఎనర్జీని తొలగించే శక్తి మొత్తం గుమ్మడికాయ నుంచి పోతుందని చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడూ తొడిమ పైకి ఉండేలా పట్టుకోవాలని సూచిస్తున్నారు.

గుమ్మడికాయ ఏ రోజున, ఏ సమయంలో కడితే మంచిది:ఇక చాలా మంది తమకు తోచిన సమయంలో బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీస్తుంటారు. అయితే ఇది కట్టడానికి కూడా ప్రత్యేక సమయం ఉంటుందని అంటున్నారు మాచిరాజు కిరణ్​ కుమార్​.. అది చూస్తే..

బూడిద గుమ్మడికాయ కట్టడానికి అనువైన సమయం అమావాస్య అంటున్నారు మాచిరాజు. అవును అమావాస్య రోజు అది కూడా సూర్యోదయానికి ముందే కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని.. తద్వారా నరదిష్టి, కనుదిష్టి తొలగిపోతుందని చెబుతున్నారు. ఒకవేళ అమావాస్య రోజు కట్టడం వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందే కట్టమంటున్నారు. సూర్యోదయానికి ముందు కడితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని, సూర్యోదయం తర్వాత కడితే మిశ్రమ ఫలితాలు అందుతాయని, సూర్యాస్తమయం తర్వాత కడితే ఎటువంటి ఫలితాలు అందవని సూచిస్తున్నారు. కాబట్టి బూడిద గుమ్మడికాయను ఎల్లప్పడూ సూర్యోదయానికి ముందే కట్టమని సలహా ఇస్తున్నారు.

ఎలా కట్టాలి:

  • ముందుగా బూడిద గుమ్మడికాయను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • ఆ తర్వాత దానిని జాలిలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి.

కొబ్బరికాయకు నిత్యపూజ- 108 గవ్వలతో అష్టోత్తరం- లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే చేయాల్సిన పనులివే!

ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారా? ఈ పరిహారాలు పాటిస్తే దోషాల నుంచి ఉపశమనం!

కలలో పాములు కనిపిస్తున్నాయా? - ఇలా కనిపిస్తే ధనప్రాప్తి! - అలా వస్తే ఆర్థిక సమస్యలు తప్పవట!

ABOUT THE AUTHOR

...view details