తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

దీపావళి అర్ధరాత్రి ఈ ప్రత్యేక పూజ చేస్తే - ఏడాదంతా లక్ష్మీ దేవి ఆనంద తాండవం చేస్తుందట! - HOW TO DO MAHANISHI LAXMI PUJA

-లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం దీపావళి రోజు మహానిశి లక్ష్మీ పూజ -గోధుమల దీపం పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం

Mahanishi Laxmi Puja at Home
Mahanishi Laxmi Puja at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 7:10 AM IST

How to Do Mahanishi Laxmi Puja at Home:చీకట్లను తరిమి వెలుగులు విరజిమ్మే దీపావళి వచ్చేసింది. ఈరోజున అందరి ఇళ్లూ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతాయి. ఇక బాణసంచా మోతలతో సందడంతా పిల్లలదే. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పెద్దలు ధనలక్ష్మీ పూజ చేస్తారు. అయితే దీపావళి రోజు కేవలం ధనలక్ష్మీ పూజ మాత్రమే కాకుండా చాలా మంది మహానిశి లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజ చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఆనంద తాండవం చేస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ సంవత్సరం ఆ పూజ ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం? గోధుమల దీపం ఎలా పెట్టాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మహానిశి పూజా ఎప్పుడు చేసుకోవాలి: అక్టోబర్​ 31వ తేదీ సాయంత్రం దీపావళిపండగ నిర్వహించుకోవాలన్న సంగతి తెలిసిందే. అయితే దరిద్ర దేవత పోయి ఇంట్లో లక్ష్మీ దేవి స్థిర నివాసం ఉండాలంటే గురువారం అర్థరాత్రి 12 గంటలకు ప్రత్యేకమైన పూజ చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. దానినే మహానిశి పూజ అంటారని.. అక్టోబర్​ 31వ తేదీ గురువారం రాత్రి 11.23 గంటల నుంచి 12.16 గంటల మధ్యలో మహానిశి పూజ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మహా నిశి పూజా విధానం:మహానిశి పూజ చేసే ముందు అలక్ష్మీ నిస్సరణ అనే విధానాన్ని పాటించాలని అంటున్నారు. అంటే రాత్రి 11.23 గంటల నుంచి అర్ధరాత్రి 12.16 గంటల మధ్యలో అలక్ష్మీ నిస్సరణ చేసి మహానిశి పూజ చేసుకోవాలి. అందుకోసం

  • ముందుగా కొత్త చీపురుతో ఇళ్లంతా శుభ్రం చేయాలి.
  • ఆ తర్వాత ఉప్పు నీటిలో తడిగుడ్డ వేసి ఇళ్లంతా తుడవాలి. దీనినే అలక్ష్మీ నిస్సరణ అంటారని మాచిరాజు చెబుతున్నారు.
  • తర్వాత పూజ మందిరాన్ని అలకరించుకోవాలి.
  • ఆ తర్వాత లక్ష్మీ దేవి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
  • పూలతో అలంకరించుకోవాలి.
  • ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి.
  • అనంతరం 108 రూపాయి నాణెలతో లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజిస్తూ అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకోవాలి.
  • ఆ తర్వాత అమ్మవారికి కర్పూర హారతి అందించాలి.
  • అనంతరం ఆవుపాలు లేదా బెల్లంతో చేసిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి.
  • మరునాడు అంటే నవంబర్​ 1వ తేదీ ఉదయం స్నానం చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన 108 రూపాయి నాణెలను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టాలి. ఇలా మహానిశి లక్ష్మీ పూజ చేస్తే ఏడాదంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

గోధుమల దీపం ఎప్పుడు, ఎలా పెట్టాలి: లక్ష్మీ కటాక్షం కోసం గోధుమల దీపం పెట్టాలని మాచిరాజు చెబుతున్నారు. అది అక్టోబర్​ 31 గురువారం సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇంటి ముందు ఈ దీపాన్ని పెట్టాలని సూచిస్తున్నారు. అది ఎలాగంటే..

  • ఇంటి ముందు ప్లేట్​ లేదా విస్తరి పెట్టి అందులో గోధుమలు పోయాలి.
  • ఆ గోధుమల మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి.
  • ఈ గోధుమల దీపాన్ని రాత్రంతా వెలిగేలా చూసుకోవాలని.. మరుసటి రోజు తెల్లవారుజాము వరకు వెలిగేతే మరీ మంచిదని.. లేకుంటే మహానిశి పూజా సమయం వరకు వెలిగేలా చూసుకోవాలని వివరిస్తున్నారు.
  • గోధుమల దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు స్నానం చేసి ఆ ప్రమిద కింద ఉన్న గోధుమలను నానబెట్టి గోమాతకు తినపించడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్లు మొదట్లో వేయడం లేదా పారే నీటిలో వదిలిపెట్టడం చేయవచ్చని చెబుతున్నారు.

దీపావళి స్పెషల్​ "మోతిచూర్​ లడ్డూ" - ఈ టెక్నిక్​ తెలిస్తే బూందీ గరిటెతో పనేలేదు - టేస్ట్​లో నో కాంప్రమైజ్​!

దీపావళి వేళ ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే - మీ ముఖం అందమైన దీపంలా మెరిసిపోతుందట!

దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!

ABOUT THE AUTHOR

...view details