Karthika Somavaram Pooja Rituals :ప్రస్తుతం శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తిక మాసం నడుస్తోంది. అందులో భాగంగానే ప్రతిఒక్కరూ ఈ నెల మొత్తం విశేషమైన పూజలు చేస్తుంటారు. అయితే, పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే కార్తిక సోమవారం కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం.. కార్తిక సోమవారం నాడు ఈ 6 పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే.. పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఆ నియమాల్లో ఏ ఒక్కటి ఫాలో అయినా కూడా శివుడు పరమానంద భరితుడై మీ మనోభిష్టాలన్ని నెరవేరుస్తాడని చెబుతున్నారు. అవేంటంటే..
ఉపవాసం :కార్తిక సోమవారం ఉపవాసం ఉండి రోజంతా శివ నామస్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడిఅనుగ్రహం పొందడమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు. అంటే.. వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇక నెక్ట్ డే ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి.
ఏకభుక్తం : పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని ఏకభుక్తం. అంటే.. ఉదయం శివ పూజ చేశాక ఆహారం స్వీకరించొచ్చు. కానీ, సాయంత్రం మళ్లీ శివ పూజ, శివాభిషేకం చేశాక రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. తర్వాతి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆపై మీరు ఆహారం తీసుకోవాలి.
నక్తం :కార్తిక సోమవారం ఉదయం పూట శివ పూజ, శివాభిషేకం చేశాక భోజనం చేయవద్దు. మళ్లీ, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తం అంటారు. అన్నింటిలో కంటే ఈ ఒక్కటి పాటించినా శివుడి అనుగ్రహానికి ఈజీగా పాత్రులు కాగలంటున్నారు.
అయాచితం :కార్తికమాసంలో సోమవారం ఈ నియమం పాటించినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు కిరణ్ కుమార్. అయాచితం అంటే ఏమిటంటే.. మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించడంగా చెబుతారు.