Horoscope Today January 5th 2025 : 2025 జనవరి 5వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీ గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్న వారి ఎదురుచూపులు ఇక ముగిసినట్టే. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారుస్థులకు వ్యాపారపరంగా అద్బుతమైన రోజు. గణనీయమైన లాభాలను అందుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శ్రీలక్ష్మి దేవి ధ్యానం శుభకరం.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సంబంధాలు చెడగొట్టుకోవడం సరైనది కాదు. పరిస్థితులతో రాజీపడేందుకు ప్రయత్నించండి. విలాసవంతమైన వాటిపై అధికంగా ఖర్చు చేస్తారు. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం సరిగా లేనందున చేపట్టిన పనులు పూర్తి చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు, మీ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. పరుష మాటలతో ఇతరులకు బాధ కలిగించవద్దు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు పూర్తి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయాల బాట పట్టడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కన్య (Virgo) :కన్య రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వృత్తి పరంగా, ఆర్థికంగా సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపార భాగస్వాముల నుంచి పెట్టుబడుల రూపంలో ప్రయోజనాలను పొందవచ్చు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. ఈ రోజు పెట్టే పెట్టుబడుల నుంచి దీర్ఘకాలంలో ప్రయోజనాలు, లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా వృత్తి పరంగా ప్రతికూల సవాళ్లు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ విషయాల్లో ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా ఉంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమయానుకూలంగా నడుచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సామరస్యపూర్వక ధోరణితో కలహాలకు దూరంగా ఉంటారు. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా మీ ప్రయాణం సాగుతుంది. వృత్తిలో అవరోధాలు, ఆటంకాలు ఎదురుకావచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ఒక కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపడం వల్ల మానసికంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను దూరం పెడితే విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. శని స్తోత్రం పారాయణ మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సత్ఫలితాలు సాధించాలంటే మీ శక్తియుక్తులను సరైన మార్గంలో వినియోగించాలి. మానసికంగా అలజడిగా ఉంటారు. యోగా, ధ్యానంతో ప్రశాంతత పొందవచ్చు. కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఇవ్వదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.