Horoscope Today April 12th 2024 : ఏప్రిల్12న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజంతా కాస్త పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబసభ్యుల విషయంలో శ్రద్ధ పెట్టాలి. కుటుంబమే మీ మొట్టమొదటి ప్రాధాన్యంగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. అనవసర వాదనలకు పొతే అపవాదులు వచ్చే ప్రమాదముంది. ఖర్చులు అదుపులో పెట్టుకోండి. భవిష్యత్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేస్తే మంచిది. శివారాధన చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అభివృద్ధి, ధన లాభం సూచితం. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. విందువినోదాల కోసం ధనవ్యయం చేస్తారు. గృహ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. మరిన్ని మెరుగైన ఫలితాలకోసం దుర్గాస్తుతి పఠించండి.
మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేనందున అప్రమత్తంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదం. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు పొరబాటు మాటలు దొర్లితే, వివాదాలు, అపార్థాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ధ్యానం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. నేత్ర సంబంధిత సమస్యలు రావచ్చు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ఇష్ట దేవతారాధనతో సమస్యలు నుంచి బయటపడవచ్చు.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ సానుకూల ఆలోచనలతో మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ఆకస్మిక ధన లాభం మీకు సంతోషం కలిగిస్తుంది. విహారయాత్రలకు వెళతారు. మొత్తం మీద ఈ రోజు ఆనందకరంగా గడిచిపోతుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ సానుకూల దృక్పధం, కృత నిశ్చయంతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. మీ తండ్రిగారితో మీ బంధం దృఢపడుతుంది. వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన రోజు. శ్రీ సుబ్రమణ్య స్వామి ధ్యానం మేలు చేస్తుంది.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలసట, బద్ధకం కారణంగా పని పట్ల నిరాసక్తతో ఉంటారు. ఎటు చూసినా వ్యతిరేక పరిస్థితులే కనిపిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉంటారు. పై అధికారులు విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం చేయండి. శత్రు జయం కోసం ఆంజనేయ స్వామిని ప్రార్ధించండి.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా లేకపోతే ఆపదలు చుట్టుముట్టుతాయి. వాదనలు, గొడవలకు దూరంగా ఉంటే మేలు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే చాలా ప్రమాదం. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటే రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. నవగ్రహ స్తోత్రం పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడుస్తుంది. ఈ రోజంతా సరదాగా, సంతోషంగా ఉంటారు. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా లాభ పడతారు. నూతన వస్త్ర, వస్తు లాభం. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. గృహంలో శాంతి, సౌఖ్యాలు నెలకొంటాయి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభం సూచితం. శివారాధనతో ప్రశాంతత పొందుతారు.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోను ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. రోజంతా తెలియని దిగులు, ఆందోళనతో సతమతమవుతారు. ఇంట్లో అందరికీ అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారస్థులు కష్ట పడితే తప్ప ప్రయోజనాలు పొందలేరు. ఖర్చులు మితిమీరే ప్రమాదముంది. పరిణితితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి శుభ సమయం. కీలకమైన నిర్ణయాలు తీసుకోడానికి అనుకూలమైన సమయం. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సొంతమవుతుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. విందువినోదాలలో పాల్గొంటారు. మరిన్ని శుభ ఫలితాల కోసం ఇష్ట దేవతారాధన చేయండి