తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ఎక్కడ అడుగు పెట్టినా విజయమే- 100% సక్సెస్ రేట్ మరి!

డిసెంబర్​ 2వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Horoscope Today December 2nd 2024 : డిసెంబర్​ 2వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్స్ మొదలు పెట్టడానికి మంచి రోజు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆందోళన, ఒత్తిడి తొలగించుకునేటందుకు ధ్యానం, యోగా చెయ్యండి. వివాదాలకు దారితీసేలా మాట్లాడవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా టెన్షన్, ఒత్తిడి అధికంగా ఉంటుంది. నచ్చిన వారితో గడపడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పాజిటివ్ ఎనర్జీ వల్ల అడుగు పెట్టిన ప్రతి చోటా విజయమే వరిస్తుంది. సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల ఫలితాలు రావడం వల్ల అసహనంగా ఉంటారు. మనోబలంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. యోగా ధ్యానం ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటుతో మాటజారి తరువాత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ముందుచూపుతో వ్యవహరించడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు అవసరం. సానుకూల దృక్పథంతో ఉంటే విజయం సిద్ధిస్తుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్నీ సాఫీగా సాగిపోతున్నాయని అనుకునే సమయంలో అనుకోని అవాంతరాలు వచ్చి పడతాయి. మనోబలాన్ని కోల్పోవద్దు. పట్టుదలతో కృషిచేస్తే అవాంతరాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర విషయాలు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడం అవసరం. వ్యాపారంలో వివిధ మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. కుటుంబ కలహాలు తీవ్రమవుతాయి. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించవచ్చు. అనుకోని ఆపదలు ఎదురవుతాయి. ఆంజనేయస్వామి దండకం పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సూటిగా లక్ష్యం వైపు ప్రయాణించగలిగితే విజయం తధ్యం. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారి పట్ల అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో జరిగే అనవసర చర్చలకు ముగింపు పలుకుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆలోచించి ఖర్చు చెయ్యండి. విలాసాల కోసం ఖర్చు చేస్తే ఆర్థికంగా నష్టపోతారు. విద్యార్థులకు ఇది గడ్డు రోజు. చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. మెరుగైన ఫలితాల కోసం గణపతిని ప్రార్ధించండి.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు, పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. గృహ వాతావరణం ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చులను అదుపు చెయ్యండి. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తారాబలం అద్భుతంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి ఈ రోజు వరాల జల్లులు కురుస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపుదల, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రచయితలకు, కవులకు ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ సృజనాత్మకతకు మంచి గుర్తింపు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేయడానికి అనుకూల సమయం. ఉద్యోగస్తులు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ దుర్వార్త మనస్తాపం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో ఎవరిని నమ్మవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details