Horoscope Today 28th October 2024 : 2024 అక్టోబర్ 28వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతానం అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ రంగాల వారికి, వైద్య వృత్తి నిపుణులకు ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సృజనాత్మకరమైన పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ సహోద్యోగులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వృత్తి పట్ల మీ నిబద్ధతత, కష్టించి పనిచేసే విధానం మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది. ఆర్ధికంగా ఈ రోజు మీకు అత్యంత ఫలదాయకమైన రోజు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఈ సమావేశం మీ భవిష్యత్‌కు ఉపయోగపడుతుంది. కుటుంబ కలహాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శనిస్తోత్ర పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ సమర్థతపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలుతారు. దృఢ సంకల్పం, ప్రశాంత చిత్తంతో మీరు అత్యంత కఠినమైన పనులను కూడా సునాయాసంగా చక్కదిద్దగలుగుతారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ శ్రేయస్సు పట్ల దృష్టి పెట్టాలి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ మొండితనం, ఉద్రేకపడే స్వభావం కారణంగా చిక్కుల్లో పడతారు వృత్తి పరంగా కఠిన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకొని ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ విషయాల్లో రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. ఆత్మ విశ్వాసంతో ఉండటం మంచిదే కాని గర్వ పడితే సమస్యలు తీవ్రరూపం దాల్చి అత్యంత ప్రియ మిత్రులను కూడా దూరం చేస్తాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి తమ తమ రంగాలలో విజయాలతో పాటు ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. స్నేహితుల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. మంచి పాజిటివ్ ఎనర్జీతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. స్థానచలనం సూచన కూడా ఉంది. సామాజిక గుర్తింపు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. వృత్తి వ్యాపారాలలో వచ్చే తాత్కాలిక అవాంతరాలు ఆందోళన కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు మా నసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేస్తే ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండవచ్చు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అనారోగ్యం కారణంగా ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. సమీప బంధువులతో అకారణ కలహాలు ఏర్పడతాయి. మాట అదుపులో పెట్టుకోలేని మీ బలహీనత కారణంగా శత్రువులు పెరుగుతారు. ప్రతికూల ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించే ప్రయత్నం చేయండి. శనికి తైలాభిషేకం చేయించడం వలన సానుకూల ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఎటు చూసినా ఆనందం, ఉత్సాహంతో ఈ రోజంతా నిండి ఉంటుంది. పట్టుదల, ఆత్మ విశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టు పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభాలను అందుకునే సూచన ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ఉద్యోగులు నూతన బాధ్యతలు చేపడతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.