తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మాఘమాసంలోని విశేషమైన పండుగలు- పుణ్య తిథులు ఇవే! - MAGHA MASAM 2025

మాఘమాసం స్పెషల్​ - విశేషమైన పండుగల, పుణ్య తిథుల వివరాలు మీ కోసం!

Magha Masam 2025
Magha Masam 2025 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 5:31 AM IST

Magha Masam 2025 Festival List :హిందూ సంప్రదాయం ప్రకారం కార్తిక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం. మాధవ మాసంగా పేర్కొనే మాఘ మాసం శివ కేశవుల ఆరాధనకు, నదీ, సముద్ర స్నానాలకు విశేషమైనది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాఘ మాసం మొత్తం ఎన్నో పర్వదినాలు, పుణ్యతిథులు ఉన్నాయి. ఈ సందర్భంగా మాఘ మాసంలో రానున్న పర్వదినాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

శుభకార్యాల మాసం మాఘ మాసం
మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్య తిధులే. మాఘ మాసం జనవరి 30 (గురువారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది.

  • జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి: పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం.
  • జనవరి 31 మాఘ శుద్ధ విదియ: చంద్రోదయం. మాఘ మాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది.
  • ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి: దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి.
  • ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి/ షష్ఠి : వసంత పంచమి , శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. మహా కుంభ మేళాలో నాలుగవ రాజస్నానం.
  • ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి : రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు.
  • ఫిబ్రవరి 5 మాఘ శుద్ధ అష్టమి : భీష్మాష్టమి
  • ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి: మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం.
  • ఫిబ్రవరి 7 మాఘ శుద్ధ దశమి: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం, దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి పుష్పయాగం.
  • ఫిబ్రవరి 8 మాఘ శుద్ధ ఏకాదశి:భీష్మ ఏకాదశి.
  • ఫిబ్రవరి 9 మాఘ శుద్ధ ద్వాదశి : ద్వాదశి పారణ
  • ఫిబ్రవరి 10 మాఘ శుద్ధ త్రయోదశి :సోమ ప్రదోష వ్రతం
  • ఫిబ్రవరి 12 మాఘ శుద్ధ పౌర్ణమి : మాఘ పౌర్ణమి. నదీ స్నానం. కుంభ సంక్రమణం, రామకృష్ణ తీర్ధ ముక్కోటి, మహా కుంభ మేళాలో అయిదవ రాజస్నానం.
  • ఫిబ్రవరి 13 మాఘ బహుళ పాడ్యమి :తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయ కలహ మహోత్సవం
  • ఫిబ్రవరి 16 మాఘ బహుళ చవితి : సంకష్ట హర చతుర్థి
  • ఫిబ్రవరి 17 మాఘ బహుళ పంచమి :తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద శాత్తుమొర
  • ఫిబ్రవరి 18 మాఘ బహుళ షష్ఠి : తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • ఫిబ్రవరి 19 మాఘ బహుళ సప్తమి: తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • ఫిబ్రవరి 22 మాఘ బహుళ నవమి : తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి గరుడసేవ.
  • ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి: సర్వ ఏకాదశి, విజయ ఏకాదశి
  • ఫిబ్రవరి 25 మాఘ బహుళ ద్వాదశి : భౌమ ప్రదోషం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి రధోత్సవం
  • ఫిబ్రవరి 26 మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి : మహాశివరాత్రి పర్వదినం. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. తిరుపతి కపిలేశ్వర స్వామి వారి నంది వాహనోత్సవం, తిరుకచ్చినంబి ఉత్సావారంభం
  • ఫిబ్రవరి 27 మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య : తిరుపతి కపిలేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం
  • ఫిబ్రవరి 28 మాఘ బహుళ అమావాస్య : తిరుపతి కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. దర్శఅమావాస్య. ద్వాపర యుగాది, మాఘమాసం సమాప్తం.

పరమ పవిత్రమైన మాఘ మాసంలో నెల రోజుల పాటు శివ కేశవులను పూజించే వారిపట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాఘ మాసంలో శాస్త్రంలో చెప్పిన విధముగా పండుగలు జరుపుకుందాం. ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం.

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మాఘమాసంలో పెళ్లి చేసుకుంటే- సంతాన, సౌభాగ్యాలు, ఐష్టైశ్వర్యాలు కలగడం ఖాయం!

నాగలమడక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు- దోషాలన్నీ పటాపంచల్!

ABOUT THE AUTHOR

...view details