Simple Ways to Attract Goddess Lakshmi : ప్రతి వ్యక్తి అమితమైన సంపదను కోరుకుంటారు. అది సాధ్యం కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాల్సిందే! ఈ కారణం చేతనే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు అనేక పూజా కార్యక్రమాలు చేపడుతుంటారు. అయినప్పటికీ కొంతమందిని ఆర్థిక సమస్యలను వెంటాడుతుంటాయి. అలాంటి వారు దీపావళి రోజు పెరుగుతో ఈ చిన్న పని చేయండి. మీరు ఊహించని అదృష్టం కలసి రావడమే కాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్యనిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ, దీపావళివేళ పాటించాల్సిన ఆ ప్రత్యేక విధివిధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దీపావళికి, పెరుగుకి అద్భుతమైన సంబంధం ఉందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అందుకు కారణమేమిటంటే.. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ సమయంలో క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో దీపావళి రోజునే ఉద్భవించినదట. ఇక్కడ పాల సముద్రం అంటే పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులన్నింటికీ సంకేతం. కాబట్టి పెరుగులో లక్ష్మీదేవి ఉంటుందట. అందుకే ఎవరైనా సరే దీపావళి రోజు పెరుగును ఉపయోగించి ఒక ప్రత్యేకమైన విధివిధానం పాటిస్తే ఊహించని విధంగా అదృష్టం కలసివస్తుందని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది.
దీపావళి నాడు పెరుగుతో ఏం చేయాలంటే?
దీపావళి రోజు మీరు పాటించాల్సిన ఆ ప్రత్యేకమైన విధివిధానమేంటంటే.. మీరు స్నానం చేసే నీళ్లలో రెండు స్పూన్ల పెరుగుకలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ వాటర్‌తో స్నానమాచరించాలి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. దాంతో మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇక్కడ మీరు తీసుకునేది ఆవు పెరుగు అయితే మరీ మంచిది. అది లభించని పక్షంలో గేదె పెరుగును వాడుకోవచ్చంటున్నారు. అయితే, స్నానమాచరించడానికి ముందు ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఇంకా మంచిదంటున్నారు.
స్నానానికి ముందు ఇలా చేయాలట!