YSRCP Leader Vallabhaneni Vamsi Will Arrest : కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Gannavaram TDP Office Attack Case :గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనకపోయినా, ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైఎస్సార్సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలు ఉన్నాయి. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వల్లభనేని వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం - వల్లభనేని వంశీ అరెస్టు తప్పదా? - TDP Office Attack Case Updates
ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.
అయితే టీడీపీ కార్యాలయం దాడి కేసులో పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, నాలుగు సంవత్సరాలుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు.
వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ - విచారణ ఆగస్టు 2కు వాయిదా - HC on TDP Office Attack Case
ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
హైకోర్టుకు క్యూ కడుతున్న వైఎస్సార్సీపీ నేతలు - బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి - YSRCP Leaders bail petition