YSRCP Controversy CI Got Best Service Award: విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగారనే ఆరోపణలతో రాష్ట్ర డీజీ కార్యాలయానికి సరెండర్ చేసిన వివాదాస్పద సీఐ జాకీర్ హుస్సేన్ మళ్లీ బదిలీపై తిరిగొచ్చి అనంతపురం జిల్లాలో హవా నడుపుతున్నారు. మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు. గతంలో జిల్లా స్పెషల్ బ్రాంచి సీఐగా ఉన్న జాకీర్ అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో అంటకాగుతూ బాధితులపైనే అక్రమ కేసులు పెట్టినట్లు ఫిర్యాదులొచ్చాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే అక్రమాలకు కొమ్ముకాస్తూ బాధితుల పైనే కేసులు పెట్టిన ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ జాకీర్ హుస్సేన్ మళ్లీ అనంతపురం జిల్లా వీఆర్‌కు వచ్చేశారు. పదేళ్లకు పైగా జిల్లాను దాటి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారని జాకీర్‌పై విమర్శలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ సమయంలో తాడిపత్రిలోఅల్లర్లు జరిగినా జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వలేదు. వివాదాస్పద డీఎస్పీ వీఎన్కే చైతన్య తాడిపత్రికి వచ్చి అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచారు.
స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌పై చర్యలు - డీజీ కార్యాలయానికి అటాచ్ - CI Zakir Hussain