ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'వారి సేవలు వద్దు' - పెద్దిరెడ్డికి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

YSRCP Activists anger against MLAs: ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మార్పు అంశంపై కార్యకర్తలు, నేతలు సమావేశమయ్యారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలకు మళ్లీ టికెట్ ఇస్తే వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమని హెచ్చరించారు. శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిలకు టికెట్ ఇద్దంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేశారు.

YSRCP Activists anger against  MLAs
YSRCP Activists anger against MLAs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 3:58 PM IST

YSRCP Activists Anger Against MLAs: సీఎం జగన్ ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగా మార్పులు చేర్పులు చేపడుతుంటే, కార్యకర్తలు మాత్రం తమ ఎమ్మెల్యేల తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం వైఎస్సార్సీపీ రాజకీయాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తలపోటుగా మారాయి. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్యేల తీరుపై వ్యతిరేకతతో ఉన్న కార్యకర్తలు తమ నియోజకవర్గానికి పలానా ఎమ్మెల్యే సేవలు వద్దంటూ సమావేశాలు నిర్వహిస్తూ మంత్రి పెద్దిరెడ్డికి తమ నిరసన తెలుపుతున్నారు.

'వారి సేవలు వద్దు' - పెద్దిరెడ్డికి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

శింగనమల నియోజకవర్గం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు అనంతపురం జిల్లాలోని అలెగ్జాండర్ హోటల్​లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆమెకు అనుకూలంగా ఉన్న వ్యక్తి అయిన వీరాంజనేయులును సమన్వయకర్తగా నియమించారు. ఈ నేపథ్యంలో శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు తమకు వద్దంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు పెద్దిరెడ్డిని కలిశారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకోకుండా, శింగనమల సమన్వయకర్తను ఏకపక్షంగా ఎలా నియమించారంటూ మంత్రి పెద్దిరెడ్డిని నిలదీశారు. తాము వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నామని, తమలాంటి వారి అభిప్రాయాలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అసమ్మతి నేతలంతా ఆర్అండ్​బి గెస్ట్ హౌస్​లో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కలిసి ఎమ్మెల్యే మార్పు అంశంపై చర్చించారు.

ఎమ్మెల్యేలను కాదు-జగన్‌నే మార్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు: కాలవ శ్రీనివాసులు

పుట్టపర్తి నియోజకవర్గం: పుట్టపర్తి జిల్లా నల్లమాడ మండలం షాదీ మహల్లో, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచింది మెుదలూ దుద్దుకుంట కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలో అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రథమ స్థానంలో ఉంటాడని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అక్రమాలపై జిల్లా బాధ్యులు పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఎమ్మెల్యే ప్రజాసంకల్ప యాత్ర అంటూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ యాత్రలో కార్యకర్తలు లేక వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని కార్యకర్తలు ఆరోపించారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సైతం దూరం పెడుతూ, ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు. 'జగన్ ముద్దు - శ్రీధర్ రెడ్డి వద్దు' అంటూ నినాదాలు చేశారు. శ్రీధర్ రెడ్డికి మరో సారి టికెట్ ఇస్తే తామంతా పార్టీ కోసం పని చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా ఓడిస్తామని తెలిపారు.

"జగన్​ను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలన్నీ పక్కనపెట్టారు"

ABOUT THE AUTHOR

...view details