ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'ఇదేంటీ మీరు దిల్లీకి వెళ్లలేదా?'- శాసనమండలిలో ప్రత్యక్షమైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు - YSRCP MLCs in Legislative Council - YSRCP MLCS IN LEGISLATIVE COUNCIL

YSRCP Two MLCs in Legislative Council: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్సీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలు దిల్లీకి వెళ్లగా ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలిలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యులంతా సభకు దూరంగా ఉండగా ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం సభకు రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

YSRCP_Two_MLCs_in_Legislative_Council
YSRCP_Two_MLCs_in_Legislative_Council (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 9:25 AM IST

YSRCP Two MLCs in Legislative Council:రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్సార్సీపీ నేతల కదలికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ దిల్లీలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తున్నామని సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కలిసి మంగళవారం దిల్లీకి వెళ్లారు. అయితే వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం మంగళవారం శాసనమండలికి హాజరయ్యారు. దీంతో టీడీపీ, ఇతర పక్షాల కొందరు నేతలు 'ఇదేంటీ.. మీరు దిల్లీకి వెళ్లలేదా' అంటూ వారిని అడిగారు. వైఎస్సార్సీపీ సభ్యులంతా సభకు దూరంగా ఉండగా ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం రావడం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details