ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏలోకి జోరుగా చేరికలు- వైసీపీని వీడుతున్న నేతలు - Joined TDP from YCP - JOINED TDP FROM YCP

YCP Leaders and Sctivists Joining TDP Across the State: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగతూనే ఉన్నాయి. ఆ పార్టీ నాయకుల అక్రమాలు భరించలేక వైసీపీను వీడి టీడీపీలోకి చేరుతున్నారు. వారికి టీడీపీ నేతలు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.

ycp_leaders_join_tdp
ycp_leaders_join_tdp

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 8:31 PM IST

YCP Leaders and Sctivists Joining TDP Across the State:సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అక్రమాలు తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీను వీడి టీడీపీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేతలు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.

Srikakulam District:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీకి చెందిన 200 కుటుంబాలు రమణమూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్​తో పాటు వార్డు సభ్యులు టీడీపీలో చేరారు.

'జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్ మోసం'- టీడీపీలో చేరిన వాలంటీర్ - Resigned Volunteer Post Joined TDP

Vizianagaram District:విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు దాదాపు వెయ్యి మంది జనసేనలో చేరారు. భోగాపురంలోని పార్టీ కార్యాలయంలో జనసేన అభ్యర్థి లోకం మాధవి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని లోకం మాధవి తెలిపారు.

Prakasam District:సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల వైసీపీ నాయకుడు చేగిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన 60 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వీరికి నియోజవర్గ ఇంఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో కేశవరాజు కుంటకు చెందిన 50 కుటుంబాలు నాయకులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేశారు. మాగుంట వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో చిన్న అభివృద్ధి కూడా జరగలేదని అందుకే వైసీపీ నుంచి తెదేపా పార్టీ లోకి చేరుతున్నామని చెప్పారు.

జగన్​కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ- లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురాజు సతీమణి

Sri Sathya Sai District:శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుచ్చయ్యగారిపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నృత్యాలతో బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సింధూర రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని సింధూర రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ప్రాధాన్యం కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కచ్చితంగా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం సత్తా చూపించాలని కోరారు.

టీడీపీలోకి వసంత కృష్ణప్రసాద్​, భారీగా అనుచరులతో కలిసి హైదరాబాద్​లో చేరిక

Kurnool District:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సొగనూరుకు చెందిన 100 మంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో పతనం ఖాయమని జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమిని ఆదరిస్తున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏలోకి జోరుగా చేరికలు

ABOUT THE AUTHOR

...view details