YCP Activists Provocative Actions in YS Sunitha Election Campaign:వైఎస్వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె సునీత పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పులివెందుల మండలం పెద్ద రంగాపురం, చిన్న రంగాపురం, సారాయి వారిపల్లె గ్రామాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద రంగాపురంలో వివేక హత్య కేసు విషయాన్ని సునీత ప్రజలకు వివరించి చెప్పారు. హత్య చేయించిన వ్యక్తులకు ఓటు వేయద్దని, రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వివేక హత్యపై మాట్లాడొద్దంటూ ప్రచారంలోకి దూసుకొచ్చిన వైసీపీ నేతలు- ధీటుగా సమాధానమిచ్చిన సునీత - YS Sunitha Election Campaign - YS SUNITHA ELECTION CAMPAIGN
YCP Activists Provocative Actions in YS Sunitha Election Campaign కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వైఎస్ సునీతను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వివేక హత్యపై మాట్లాడొద్దంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర స్థాయిలో మండిపడిన సునీత తనకు అన్యాయం జరిగిందని వారికి ఆమె దీటుగా సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రాకతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
![వివేక హత్యపై మాట్లాడొద్దంటూ ప్రచారంలోకి దూసుకొచ్చిన వైసీపీ నేతలు- ధీటుగా సమాధానమిచ్చిన సునీత - YS Sunitha Election Campaign sunitha_election_campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-04-2024/1200-675-21338040-thumbnail-16x9-sunitha-election-campaign.jpg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 8:00 PM IST
సునీత మాట్లాడుతున్న సమయంలోనే వైసీపీ కార్యకర్తలు ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. హత్య విషయం గ్రామంలో మాట్లాడవద్దని గట్టిగా అరిచారు. వైసీపీ కార్యకర్తల హెచ్చరింకలకు సునీత దీటుగా సమాధానం ఇచ్చారు. ఎందుకు వివేకానంద హత్య గురించి ఇక్కడ మాట్లాడకూడదని ఆమె ప్రశ్నించారు. మాటలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పరిస్థితి వివాదం అవుతుందని తెలుసుకున్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. తర్వాత సునీత ఎన్నికల ప్రచారం కొనసాగించారు. సారావారి పల్లెలో కూడా సునీత రాకముందే అక్కడికి చేరుకున్న కళాకారులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.