Nizamabad congress Politics : కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad Politics) కీలక పాత్ర పోషించింది. ఎప్పుడు అధికారంలో ఉన్నా, జిల్లా నుంచి మంత్రివర్గంలో, ఇతర పదవుల్లో కచ్చితంగా ప్రాతినిథ్యం లభించింది. 1980ల్లో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అర్గుల్ రాజారాం, సంతోశ్ రెడ్డిలు మంత్రులుగా పని చేశారు. జిల్లాపై వీరికి ఉన్న పట్టు సాధారణమైంది కాదు. వీరి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చిన డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీలు సైతం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పని చేశారు.
Nizamabad Political News :నిజామాబాద్ నేత డి.శ్రీనివాస్ రెండు పర్యాయాలు 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు వైఎస్సార్ హయాంలో షబ్బీర్ అలీ (Shabir ali), సుదర్శన్ రెడ్డిలు మంత్రులుగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగా, మళ్లీ ఇన్నాళ్లకు రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం లభించలేదు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్‌రెడ్డి
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే ఓడినప్పటికీ కామారెడ్డి స్థానం త్యాగం చేసినందుకు ప్రభుత్వ సలహాదారు పదవి అప్పగించారు రేవంత్‌రెడ్డి(CM Revanth reddy). ప్రమాణ స్వీకార సమయంలోనే జిల్లాకు మంత్రి పదవి ఖాయమని భావించినా అందలేదు.