Vijayawada constituency : విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. విజయవాడ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి జనరల్ కేటగిరిలో ఉంది.
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:
విజయవాడ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నందిగామ, తిరువూరు రిజర్వుడ్ స్థానాలు. 2022లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారు.
- విజయవాడ తూర్పు
- విజయవాడ మధ్య
- విజయవాడ పశ్చిమ
- మైలవరం
- నందిగామ
- జగ్గయ్యపేట
- తిరువూరు
తాజా గణాంకాల ప్రకారం ఓటర్ల వివరాలు
- మొత్తం ఓటర్లు 16,75,381
- పురుషులు 8,17,837
- మహిళలు 8,57,394
- ట్రాన్స్‌జెండర్లు 150
తొలిసారి స్వతంత్ర అభ్యర్థి హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ విజయం సాధించగా, 1967లో డాక్టర్ కేఎల్.రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని నాని 8,726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రస్తుత ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్టీకి విధేయంగా పనిచేస్తూ, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆయనకు అందరూ ఊహించినట్టే టికెట్ దక్కింది. మరోవైపు, విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కొన్ని నెలల కిందటే అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కండువా కప్పుకొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థి కూడా ఆయనే. నిన్నటి వరకూ వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్‌ను దుమ్మెత్తి పోసిన ఎంపీ నాని ఇప్పుడు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అమరావతి రాజధాని కావాలన్న ఆయన ఇప్పుడు వైఎస్సార్సీపీ నిర్ణయాలకు వంతపాడుతున్నారు. మరోవైపు చిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు సాగుతున్నారు. అన్న క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, జాబ్‌మేళాలతో నిత్యం జనంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నిక అన్నదమ్ముల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉండటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
డాల్ఫిన్ నోస్ సిటీ మన వాల్తేరు - విశాఖ లోక్‌సభ గతం తెలుసా? - Visakhapatnam LOK SABHA ELECTIONS
బెజవాడ ఎంపీలు వీరే..
1952: హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ(స్వతంత్ర)
1957: కె.అచ్చమాంబ(కాంగ్రెస్)
1962: కె.ఎల్.రావు(కాంగ్రెస్)
1967: కె.ఎల్.రావు(కాంగ్రెస్)