ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు - SECURITY FOR ASSEMBLY SESSIONS

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలుకు నిర్ణయం

security_for_Assembly_sessions
security_for_Assembly_sessions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 5:48 PM IST

Tight Security for AP Assembly Budget Sessions:అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్నికట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్​లు జారీ చేసారు. భద్రతా కారణాల రీత్యా పాస్​లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్​లు జారీ చేసారు.

అసెంబ్లీ గేట్ 1 నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేసారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్​లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేసారు. నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదని తెలిపారు. శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని బులెటిన్​లో పేర్కొన్నారు. ఒక వేళ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్​లో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు. ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో విధానపరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదని వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావొద్దని సూచించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేసారు.

విజయవాడలో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - సీసీటీవీ విజువల్స్

మీ చర్యలతో MBBS సీటు కోల్పోయింది - రూ.7 లక్షలు చెల్లించండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details