ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

సాక్షి పత్రిక కొనుగోలు కేసు - విచారణ వాయిదా వేసిన దిల్లీ కోర్టు - సాక్షి పత్రిక

Sakshi Vs Eenadu case : ఏపీలో వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనుగోలు చేయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన కేసు విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే జర్నలిజాన్ని కౌంటర్‌ చేయడానికి ఈ జీవో ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్​ తరఫు న్యాయవాది తెలిపారు.

sakshi_daily_case_delhi_high_court
sakshi_daily_case_delhi_high_court
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 9:48 AM IST

సాక్షి పత్రిక కొనుగోలు కేసు - విచారణ వాయిదా వేసిన దిల్లీ కోర్టు

Sakshi Vs Eenadu case : వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనుగోలు చేయించడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దాఖలు చేసిన కేసు తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు ఏప్రిల్‌ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ మన్‌మీత్‌ ప్రీతం సింగ్‌ అరోడాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

పత్రిక కొనడానికి నెలకు రూ.200 ఇస్తున్న ప్రభుత్వం.. ఏపీ సీఎం దంపతులకు దిల్లీ హైకోర్టు కోర్టు నోటీసులు

ఈ కేసు మంగళవారం విచారణ జాబితాలో ఉన్నా సమయాభావం వల్ల కోర్టు పనిగంటలు ముగిసే సమయానికి స్వీకరించే పరిస్థితి కనిపించలేదు. ఈ క్రమంలో ఉషోదయ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకొని సాధ్యమైనంత త్వరగా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనానికి కోరారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసినందున కాస్త త్వరగా విచారించాలని మరో సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్‌ విజ్ఞప్తి చేశారు.

'సాక్షి పత్రిక తీసేసి.. ఇంగ్లీష్ పేపర్ పెట్టుకో'

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన దినపత్రిక ‘ఈనాడు’కు సంబంధించిన కేసు అని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబం సాక్షి పత్రికను నడుపుతోందని తెలుపుతూ ప్రభుత్వం నియమించిన 4 లక్షల మంది వాలంటీర్లకు ఆ పత్రిక కొనుగోలు కోసం నెలకు 200 రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తున్నారని వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను తాము సవాల్‌ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే జర్నలిజాన్ని కౌంటర్‌ చేయడానికి ఈ జీవో ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు.

దినపత్రికగా తాము ప్రభుత్వంలో ఉండే తప్పుల గురించి రాయడం సహజమని గుర్తు చేశారు. కానీ, ఏపీలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ నిధులను ఉపయోగించి వారి సొంత పత్రికను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారని తెలిపారు. అందుకే తాము ఆ జీవోను సవాల్‌ చేస్తూ కేసు దాఖలు చేశామని సౌరభ్ కిర్పాల్‌ చెప్పారు. తర్వాత ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకుంటూ ఈ కేసును త్వరగా విచారించాలని, ఇది ఆర్టికల్‌ 19-1Aకి సంబంధించినది అని తెలిపారు. అన్నారు. ముఖ్యమంత్రికి చెందిన పత్రిక, ముఖ్యమంత్రి ఓ పత్రికను ఎలా బెదిరిస్తారని ప్రశ్నించారు. ఇది విస్తృత పరిణామాలకు దారితీసే కేసు అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్‌ 25కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాలంటీర్లతో ‘సాక్షి’ కొనిపించేందుకే నెలకు రూ.200.. తెదేపా నేత యనమల ధ్వజం

ABOUT THE AUTHOR

...view details