ETV Bharat / state

న్యూ ఇయర్‌ వేడుకలు - మెట్రో వేళలు పొడిగింపు, ఫ్లైఓవర్లు మూసివేత - NEW YEAR CELEBRATIONS

నూతన సంవత్సరం సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు

NEW_YEAR_CELEBRATIONS
NEW_YEAR_CELEBRATIONS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 8:07 PM IST

Police Restrictions on New Year Celebrations in Hyd: నూతన సంవత్సర సందర్భంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ORRపై భారీ వాహనాలు, విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎవరైనా సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో కచ్చితంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయని చెప్పారు. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ వేళల్లో మెట్రో రైలు మార్పులు చేసింది. జనవరి 1న తెల్లవారుజామున 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకల తర్వాత ప్రతి ఒక్కరూ రవాణా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో సంస్థ వెల్లడించింది. ప్రతి కారిడార్‌లో చివరి మెట్రో స్టేషన్‌ నుంచి ఆఖరి సర్వీసు 12.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది.

హైదరాబాద్​లో న్యూఇయర్​ వేడుకలు - అద్దిరిపోయే ఈవెంట్స్​

Free Transport services in Hyd: న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్​, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపింది. మీడియాతో సమావేశమైన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలో 31వ తేదీ రాత్రి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ సభ్యులు వివరించారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల రక్షణ కోసం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్‌ వీలర్స్‌ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకలు - అక్కడ తెల్లవారే వరకూ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు

ఈ రూల్స్‌ తప్పక పాటించాల్సిందే - న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.