ETV Bharat / state

వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - 'పోస్ట్‌ నో ఈవిల్‌'పై సినీ స్టార్స్ - FILM STARS ON SOCIAL MEDIA CAMPAIGN

సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచారానికి మద్దతు తెలిపుతున్న సినీ నటులు - వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపు

film_stars_on_social_media_campaign
film_stars_on_social_media_campaign (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 8:03 PM IST

Updated : Dec 30, 2024, 9:03 PM IST

Film Stars Supporting AP Govt Campaign on Social Media: సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి సినీ నటులు తమ మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అవగాహన పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు పెట్టారు. 'పోస్ట్​ నో ఈవిల్' పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటులు తోడవుతున్నారు.

మద్దతు తెలుపుతూ వీడియోలు విడుదల: ఈ ప్రభుత్వ కార్యక్రమానికి హీరోలు నిఖిల్‌, అడవి శేష్, నటి శ్రీలీల భాగమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. 'పోస్ట్‌ నో ఈవిల్‌' (Post No Evil) గురించి తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. సోషల్‌ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని కోరారు. మనం ఏదైనా వస్తువు కొనేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొంటాం కానీ సోషల్‌ మీడియాలో న్యూస్‌ షేర్‌ చేసే ముందు అది నిజమా కాదా అని ఎందుకు చెక్‌ చేసుకోవడం లేదని హితవు పలికారు.

ఎందుకంటే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా తీసుకుంటామని కానీ మనం సరదాగా షేర్‌ చేసే ఆ ఫేక్‌ న్యూస్‌ కొన్ని జీవితాలను నాశనం చేస్తుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఏదైనా విషయాన్ని పంచుకునే ముందు అది నిజమా కాదా అని ఒకటికి పదిసార్లు పరిశీలించుకోండి అని చెప్పారు.

కొత్త పద్ధతిలో సాగు - వినూత్న ఆలోచనతో యువరైతుకు లాభాలు

గుడ్​న్యూస్ - ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!

Last Updated : Dec 30, 2024, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.