Srisailam Temple Sparsha Darshan Tickets: శ్రీశైలం ఆలయంలో క్యూలైన్లను ఈవో శ్రీనివాసరావు తనిఖీ చేశారు. సోమవారం ఉదయం ఇతర టికెట్లతో స్పర్శదర్శనానికి భక్తులు వచ్చినట్లు గుర్తించారు. స్పర్శదర్శనం బదులు రూ.300 టికెట్లతో రావడంపై ఈవో ఆరా తీశారు. ఇతర టికెట్లతో స్పర్శదర్శనానికి ఎలా అనుమతిస్తారని ఈవో శ్రీనివాసరావు ప్రశ్నించారు. కొందరు సిబ్బందిపై చర్యలకు ఈవో సిద్ధమవుతున్నారు.
శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ: మరోవైపు శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మల్లన్నకు ఇష్టమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ఉచిత కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
శ్రీశైలంలో పురాతన రాగి రేకులు, బంగారునాణేలు - చరిత్రకు ఆధారాలు