Telangana MLC Jeevan Reddy Sensational Letter : తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆవేదనతో స్పందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతోపాటు మొత్తం 8 మందికి మూడు పేజీల లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నానని, తీవ్ర మానసిక బాధతో లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ లేఖ రాయాల్సి రావడంపై తాను విచారిస్తున్నానన్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ నుంచి కొందరు కాంగ్రెస్లోకి రావడం వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 65 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుస్థిర కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. కొందరు స్వార్ధ పరులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన జీవన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి పిరాయింపులకు ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఉద్దండరాయునిపాలెం వైపు దూసుకెళ్లిన CRDA జేసీబీలు - అక్రమ కట్టడాల కూల్చివేత