ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

సమంత, నాగ చైతన్య విడిపోడానికి కేటీఆరే కారణం - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు - MINISTER KONDA SUREKHA ON KTR

Minister Konda Surekha Fires On KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకొంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు.

Minister_konda_surekha_comments_on_ktr
Minister_konda_surekha_comments_on_ktr (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 3:40 PM IST

Updated : Oct 2, 2024, 5:31 PM IST

Minister Konda Surekha Fires On KTR :బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్​ అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు పెట్టారని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.

కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్​కు చెప్పినట్లు ఉన్నారన్నారు. అకౌంట్ నాది కాదు అన్నప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాలి కదా అని ప్రశ్నించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించవలసిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్​లోని బాపూ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కొండా సురేఖ 'అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళ ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్​ VS కేటీఆర్ - అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం - telangana assembly meetings 2024

నాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు :మహిళలు, చిన్న పిల్లలు బయటకు వెళితే సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై దారుణాలకు పాల్పడుతున్నారని దీనివల్ల అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయన్నారు. ఎస్టీ మహిళ సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఇప్పుడు బీసీ మహిళనైన తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరం అన్నారు.

బీఆర్ఎస్​లో తాను ఐదేళ్లు పని చేశానని తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్​కు తల్లి అక్క, చెల్లెలు లేరా? అని ప్రశ్నించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి తప్పితే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్​ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని హెచ్చరించారు.

"సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్. ఆయన మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డారు. హీరోయిన్లకు కూడా మత్తు పదార్ధాలు అలవాటు చేశారు. దీంతో హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకున్నారు. సినిమా పరిశ్రమలో ఈ విషయం బహిరంగ రహస్యం. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను కేటీఆర్‌ ఎందుకు ఖండించలేదు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్​కు చెప్పినట్లు ఉన్నారు. సైబర్ క్రైమ్​లో పిర్యాదు చేశాం పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెడతం."-కొండా సురేఖ, మంత్రి

మహిళా కమిషన్‌ ముందుకు కేటీఆర్ - బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పోటాపోటీ ఆందోళనలు - ఉద్రిక్తత - BRS AND CONGRESS PROTEST

Last Updated : Oct 2, 2024, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details