ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కేంద్రం నెరవేర్చాలి - అఖిలపక్ష భేటీలో టీడీపీ - MP Lavu on Parlment sessions - MP LAVU ON PARLMENT SESSIONS

TDP Mentioned State Problems in All Party Meeting: వైఎస్సార్​సీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అఖిలపక్షంలో ప్రస్తావించినట్లు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని అసెంబ్లీలో విడుదల చేసే శ్వేతపత్రాలపైన పార్లమెంటులోనూ చర్చిస్తామన్నారు.

mp_lavu_on_parlment_sessions
mp_lavu_on_parlment_sessions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 6:00 PM IST

TDP Mentioned State Problems in All Party Meeting:వైఎస్సార్​సీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అఖిలపక్షంలో ప్రస్తావించినట్లు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని అసెంబ్లీలో విడుదల చేసే శ్వేతపత్రాలపైన పార్లమెంటులోనూ చర్చిస్తామని తెలిపారు. అమరావతి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, పోలవరం, రైల్వే ప్రాజెక్టులపైనా సమావేశంలో లేవనెత్తుతామని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించేందుకు సమయం కావాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి దేశంలోని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. దేశం మెుత్తం ఆశ్చర్యపోయేలా శ్వేతపత్రం ఉంటుందని స్పష్టం చేశారు.

అఖిలపక్ష భేటీలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించాం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు (ETV Bharat)

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లపై కూడా మాట్లాడతామని సమస్యలు ఉంటే ప్రతిపక్షాలు అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. జగన్ దిల్లీ వెళ్లి ధర్నా చేస్తానంటున్నారు కానీ అక్కడకు వెళ్లి ధర్నా చేస్తే ప్రతిపక్షానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. మా దృష్టి మెుత్తం రాష్ట అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉందో అన్ని పార్టీలకు తెలియాలని, అలా తెలిస్తే కేంద్రం చేసే సాయాన్ని ప్రశ్నించరని అన్నారు.

అబద్దాలలో జగన్​ పీహెచ్​డీ - వైఎస్సార్సీపీ రోజురోజుకు దిగజారిపోతోంది: నాగబాబు - NAGABABU DISTRIBUTED CHEQUES

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ తెలిపారు. మా డిమాండ్ల పరిష్కారానికి సహకరించాలని అన్ని పార్టీలను అడిగినట్లు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులపై అఖిలపక్ష భేటీలో లేవనెత్తామని అలానే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను పక్కదారి పట్టించి, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేందుకు ప్రతిపక్షం యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అంశాలను అసెంబ్లీలో లేవనెత్తకుండా పారిపోయేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. వైఎస్సార్​సీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై అఖిలపక్షంలో టీడీపీ నేతలు ప్రస్తావించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆర్థిక విధ్వంసంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

ప్రజలు ఛీకొట్టినా జగన్‌ మారలేదు- ఉనికి కోసమే హత్యా రాజకీయాలు: సీఎం చంద్రబాబు - CBN Comments

వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్​కు లేదు - వైఎస్సార్సీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu Fire on Jagan

ABOUT THE AUTHOR

...view details