TDP intensify campaigns in AP:కూటమి అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఊరూరా తిరుగుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తూ, జగన్ పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరించి చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసన్నపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని, రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
ఎన్డీఏ కూటమికి మద్దతుపై: ఎన్డీఏ కూటమికి జయప్రకాష్ నారాయణ మద్దతు ఇవ్వడంపై జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి బాబ్జి సత్కరించారు. కోనసీమ జిల్లా పల్లవారిపాలెం సర్పంచ్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, తెలుగుదేశంలో చేరారు. అమలాపురం పార్లమెంటు ఇంఛార్జ్ హరీష్ మాధుర్, ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే జగన్ దోచుకున్న సొమ్మును కక్కిస్తాం: సీఎం రమేష్
సూపర్ సిక్స్ పథకాలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఐదవ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను గురించి వివరించారు. నాగలదిన్నె గ్రామానికి చెందిన వంద మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని జయనాగేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు.
పవన్ ఎంపీగా పోటీ చేస్తే - పిఠాపురం నుంచి బరిలో నేనే: మాజీ ఎమ్మెల్యే వర్మ
విజనరీ లీడర్ చంద్రబాబు: ఐదేళ్లలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే 2029లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని 8వ వార్డు పెద్దపడఖానా ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కులం, మతం కాకుండా మనిషిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయిందని, ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విజనరీ లీడర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.
తెలుగుదేశం పార్టీలోకి చేరికలు: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు గ్రామంలో బీసీ కాలనీలో పలు కుటుంబాలు, వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో, పార్టీ కండువా కప్పుకున్నారు.
టీడీపీ పార్లమెంట్ అభ్యర్థులు వీరే!