TDP Aspirants meet Chandrababu in Hyderabad:ఎన్డీఏ కూటమితో పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కని అసంతృప్తి నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మూడు నియోజకవర్గాల నేతలు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, తిక్కారెడ్డిలు కలిశారు. ప్రభాకర్ చౌదరి అనంతపురం టికెట్ ఆశించగా గుంతకల్ సీటును జితేందర్ గౌడ్, మంత్రాలయం టిక్కెట్ తిక్కారెడ్డి ఆశించారు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఆయా స్థానాలు కేటాయించడంతో వారు భంగపడ్డారు. చంద్రబాబుతో భేటీలో ప్రాంతీయ సమన్వయకర్తలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్‌లు పాల్గొన్నారు.
వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయం అందుకే రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు: చంద్రబాబు - Chandrababu Fire on YSRCP
ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, తిక్కారెడ్డిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇవ్వటంతో పాటు అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులు ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో పరిస్థితులు అర్ధం చేసుకుని సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హామీతో సంతృప్తి చెందిన నేతలు తమకు అప్పగించే బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.
మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా?: చంద్రబాబు - Vuyyuru Praja Galam meeting
భవిష్యత్తును చూసుకుంటానంటూ భరోసా:టీడీపీ - జనసేనతొలి జాబితా ప్రకటించిన తర్వాత సీట్లు దక్కని నేతలు, మిత్రపక్షానికి సీట్లు కేటాయించిన స్థానాలకు చెందిన నాయకులు చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. వారందరికీ సర్ది చెబుతున్న చంద్రబాబు సర్వేలు, సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మీ భవిష్యత్తును చూసుకుంటానంటూ చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అలానే జనసేన నాయకులతో కలిసి నడవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
పామర్రులో ఐటీ టవర్-రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
దేవినేని ఉమాకు దక్కని టికెట్టు:దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించలేదు. పొత్తులు, అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దేవినేని దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఉమాకు చంద్రబాబు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఉన్న రాష్ట్రం ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈసారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న ఉమాకు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమా మైలవరం నుంచి తిరిగి పోటీ చేయగా వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. తాజాగా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్న దేవినేని ఉమకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను టీడీపీ అధిష్ఠానం అప్పగించింది.