TDP-Janasena Workers Celebrations Across the State:టీడీపీ- జనసేన తొలి జాబితా విడుదల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఇరుపార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి తమ అభిమాన నేతలకు శుభాకాంక్షలు తెలుపారు.
Anantapur District:అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకున్నారు. జై పయ్యావుల, జైజై పయ్యావుల అంటూ నినాదాలు చేశారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం టికెట్ అమిలినేని సురేంద్రబాబుకు కేటాయించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేశారు.
Sri Sathya Sai District:సత్యసాయి జిల్లా మడకశిర అభ్యర్థిగా సునీల్ కుమార్‌ను ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం
Nandyala District:నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గౌరు చరితను ప్రకటించటంతో ఆ పార్టీ శ్రేణులు కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. అమ్మ హాస్పిటల్ కూడలిలో బాణసంచా కాల్చారు.
Tirupati District:తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థిగా నెలవల విజయశ్రీ పేరు ప్రకటించడంతో ఆమె ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. కడపలో ఇంటింటా ప్రచారం చేస్తున్న మాధవి రెడ్డి తనకు టికెట్ కేటాయించగానే సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
Prakasam District:ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే
Guntur District:గుంటూరు జిల్లా పొన్నూరుకు ధూళిపాళ్ల పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని తాడికొండ టీడీపీ అభ్యర్ధి తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి అభ్యర్థిగా లోకేశ్ పేరు ప్రకటించడంపై పార్టీ కార్యకర్తలు మహాలక్ష్మి దేవాలయం కూడలిలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టికెట్ ప్రకటించటంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పొత్తులో భాగంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు తెనాలి సీటు కేటాయించగానే జనసేన కార్యకర్తలు స్వీట్లు పంచారు. చిలకలూరిపేట టికెట్ ఇవ్వడం ప్రజలకు మరింత మేలు చేసేందుకు లభించిన అవకాశం,అదృష్టంగా భావిస్తున్నానని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్తిపాటి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయన నివాసం, ఎన్ఆర్టీ సెంటర్, పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు.
రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్
NTR District:ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్ పేరు ప్రకటించగానే టీడీపీ- జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నందిగామ తెలుగుదేశం అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను ఖరారు చేయడంతో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
Parvathipuram Manyam District:పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తెలుగుదేశం అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణిని ఖరారు చేయడంతో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పార్వతీపురం టీడీపీ అభ్యర్థిగా బోనెల విజయ్ చంద్రను ప్రకటించడంతో శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. పట్టణంలో భారీ ద్విచక్ర వాహనాలు ర్యాలీ నిర్వహించారు.