ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనూ కూటమిదే హవా - అడ్రస్​ లేని ఫ్యాన్​ - Srikakulam ELECTION RESULTS 2024 - SRIKAKULAM ELECTION RESULTS 2024

Srikakulam Election Results 2024: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా కూటమి ప్రభంజనంలో ఫ్యాన్​ కొట్టుకుపోతోంది.

Srikakulam_Election_Results_2024
Srikakulam_Election_Results_2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 12:17 PM IST

Srikakulam Election Results 2024:ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇచ్ఛాపురం టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌, వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా విజయపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష, మంత్రి సీదిరి అప్పలరాజుపై ముందంజలో ఉన్నారు. టెక్కలి వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు.

శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమదాలవలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ముందంజలో ఉన్నారు. ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి ఎన్‌. ఈశ్వర్‌రావు వైఎస్సార్సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై ఆధిక్యంలో ఉన్నారు. నరసన్నపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి, వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌పై ముందంజలో దూసుకుపోతున్నారు.

ఏపీలో కూటమి సునామీ - 150కు పైగా స్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result

రాజాం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలే రాజేష్‌పై టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాతపట్నం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై ముందంజలో దూసుకుపోతున్నారు.

ఓటమి బాటలో వైఎస్సార్సీపీ - కౌంటింగ్​ ​కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న అభ్యర్థులు - YSRCP Leaving Counting Center

ABOUT THE AUTHOR

...view details