Prathipati Pullarao on Prajagalam Meeting Success:బొప్పూడిలో జరిగిన ప్రజాగళం ఎన్డీఏ కూటమి సభ అంచనాకు మించి విజయవంతమైందని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు(Prattipati Pullarao) అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రజాగళం సభ విజయవంతం అవడంతో ప్రత్తిపాటి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజాగళం సభకు వచ్చిన జన సందోహాన్ని ఏరియల్ ద్వారా చూసిన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభినందించినట్లు తెలిపారు. ప్రజాగళం సభ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 300 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు పత్తిపాటి చెప్పారు.
ప్రజాగళం అంచనాలకు మించి విజయవంతమైంది- వచ్చేది వన్ సైడ్ ఎలక్షన్ : ప్రత్తిపాటి ప్రజాగళం విజయవంతం - ట్విట్టర్ ద్వారా స్పందించిన చంద్రబాబు
ఈ సభకు వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు అంచనాకు మించి వచ్చారని తెలిపారు. ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే లక్ష మందికి పైగా సభకు తరలివచ్చారని తెలిపారు. వైసీపీలాగా మద్యం డబ్బులు పంచలేదని స్వచ్ఛందంగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారని అన్నారు. 2014లో గుంటూరులో జరిగిన కూటమి సభతో అపూర్వ విజయం సాధించామని తిరిగి 2024లో అదే పునరావృతం అవుతుందని ప్రధాని మోదీతో తాను చెప్పినట్లు వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ చిలకలూరిపేటలో నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ప్రధాని సభలోనూ పోలీసుల నిర్లక్ష్యం - అడుగడుగునా వైఫల్యం
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలో మాట్లాడేటప్పుడు మూడుసార్లు కరెంటు పోయిందన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉండవచ్చునని సభలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని అన్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు వచ్చినప్పటికీ వారు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ఈ కారణంగానే ట్రాఫిక్, పార్కింగ్, సభా ప్రాంగణంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. రోప్ రౌండ్ చేసి సౌండ్ సిస్టమ్స్ ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉన్న పోలీసులు పట్టించుకోలేదన్నారు. సామర్థ్యానికి మించి ప్రజాబలం సభా ప్రాంగణం నిండిపోవడంతో పాటు ఎటు చూసినా 15 కిమీ దూరం వాహనాలు నిలిచిపోయి సభకు ప్రజానీకం రాలేక ఇబ్బంది పడ్డారన్నారు.
శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు
జగన్ మీటింగ్ ఎక్కడ జరిగినా జనం లేకపోతున్న పరిస్థితి కనిపిస్తుందని ప్రజా గళం సభలో సాయంత్రం మూడున్నర గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు ఒక్కరు కూడా కదల లేదన్నారు. ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు నుంచి తన కుమారుడు శరత్ వరకు రాజకీయ కక్ష సాధింపుతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలతో వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతుందని పత్తిపాటి అన్నారు.