ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

గుత్తేదారు మార్పే పోలవరానికి శాపం- స్పష్టంచేసిన కేంద్రం - Polavaram Issue in Lok Sabha

Polavaram Project Issue in Lok Sabha: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారును మార్చడమే పోలవరానికి శాపంగా మారిందని కేంద్రం చెప్పకనే చెప్పింది. గుత్తేదారును మార్చడంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి ఆలస్యమైందని కేంద్ర జలశక్తి మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Polavaram_Project_Issue_in_Lok_Sabha
Polavaram_Project_Issue_in_Lok_Sabha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 4:21 PM IST

Polavaram Project Issue in Lok Sabha:పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యానికి గుత్తేదారును మార్చడమే కారణమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2021లో ఐఐటీ హైదరాబాద్‌ ఇచ్చిన నివేదిక ఆలస్యానికి కారణాలు చెప్పిందన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లోనూ జాప్యం జరిగిందని కేంద్రమంత్రి సీఆర్​ పాటిల్ వివరించారు. పోలవరానికి గత మూడేళ్లలో కేంద్రం 8వేల 44కోట్ల 31లక్షల రూపాయలు ఇచ్చిందన్న మంత్రి.. పనుల పురోగతి వివరాలు కూడా సమాధానంలో పొందుపరిచారు. ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్​ పాటిల్ పార్లమెంటుకు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details