Nara Lokesh Inspiring Journey: తాత మహానాయకుడు. తండ్రి దార్శనికుడు. ఇరువురి పేరు నిలిపేలా రాజకీయరంగంలో సంచలనాలు సృష్టించారు తెలుగుదేశం యువతేజం నారా లోకేశ్. అతడే ఒక సైన్యం. ఎండైనా, వానైనా, చలైనా, వడగాలైనా 226 రోజులపాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్రతో పల్లెపల్లెకూ చేరారు నారా లోకేశ్. ప్రజల మనిషిగా ఎదిగారు.
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అయి కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకుని నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టి మూడు శాఖలను ప్రగతిపథంలో పరుగులు పెట్టించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి 5 వేలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ - గెలుపు దిశగా నారా లోకేశ్ - Nara Lokesh Win in Mangalagiri
ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో: ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో పని చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల హృదయాలే కాదు నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. సమాజమనే దేవాలయంలో ప్రజలని దేవుళ్లు అనే తాత నినాదం, నాన్న విధానం పుణికిపుచ్చుకున్న నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్లపాటు తిరుగులేని ప్రజాశక్తిగా నడిపించగల దమ్ము ధైర్యం ఉన్న నేత అని నిరూపించుకున్నారు.
నారా లోకేశ్ విద్యాభ్యాసం: నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులకు 1983 జనవరి 23న జన్మించారు. నాన్నది నారా వారి పల్లె. అమ్మది నిమ్మకూరు. బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్, విద్యాశ్రమంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్మీడియెట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ, హైదరాబాద్‌లో కంప్లీట్ అయ్యింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అమెరికాలో కార్నెగీ మెలన్ వర్సిటీలో బీఎస్సీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిగ్రీ పొందారు. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, హెరిటేజ్ ఫిన్‌లీజ్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
రాజకీయరంగ ప్రవేశం:వరల్డ్ బ్యాంకు మద్దతుతో వివిధ దేశాలలో అమలయ్యే కెపాసిటీ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఈ గవర్నెన్స్, కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశాలలో ప్రాజెక్టు మేనేజర్‌గా(2004-2006) పనిచేసిన నారా లోకేశ్ స్వదేశానికి చేరుకున్నారు. పూర్తిస్థాయి రాజకీయరంగ ప్రవేశం 2013లో చేసి, 2014 టీడీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర వహించారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో నారా లోకేశ్ పోషించిన పాత్ర ఎనలేనిది.
కొనసాగుతున్న కూటమి జైత్రయాత్ర - వైఎస్సార్సీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమా? - TDP clean sweep
39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో విజయం: మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై 39 ఏళ్లుగా అందని నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురవేశారు నారా లోకేశ్. టీడీపీ సభ్యత్వాల ద్వారా ప్రమాదబీమా, కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేసిన నారా లోకేశ్, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య-వైద్య సేవలు అందిస్తున్నారు. టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరాల ద్వారా 25 వేల మంది యువనాయకుల్ని తయారు చేసిన కార్యక్రమ రూపకర్త కూడా నారా లోకేశే కావడం గమనార్హం.
30 ఏళ్ల వయస్సులోనే 3 శాఖల మంత్రిగా: 2015లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో ఐటీ-ఎలక్ట్రానిక్స్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 30 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమైన 3 శాఖల మంత్రిగా నారా లోకేశ్ చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ, స్కోచ్ అవార్డులు దక్కాయి. ఏ పొలిటికల్ అనే సంస్థ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుల్లో మొదటి 20 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు నాటి ఏపీ మంత్రి నారా లోకేశ్.
స్వచ్ఛరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై నారా లోకేశ్‌కి ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్‌ను సింగపూర్ ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ యువతేజం నారా లోకేశ్, స్వచ్ఛరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, విద్య, వైద్య, మౌలిక, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై స్పష్టమైన విజన్‌తో ఉన్న నారా లోకేశ్, తాతకు తగ్గ మనవడు, తండ్రిని మించే తనయుడుగా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ - 9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైఎస్సార్సీపీ - Hello AP Bye Bye YCP