ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'ఓటు వేసి వస్తాం'- వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్​పై సీబీఐ కోర్టులో విచారణ - CBI Court on Bhaskar Reddy Petition - CBI COURT ON BHASKAR REDDY PETITION

CBI Court on YS Bhaskar Reddy Petition: సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్లపై విచారణ జరిగింది. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

CBI_Court_on_YS_Bhaskar_Reddy_Petition
CBI_Court_on_YS_Bhaskar_Reddy_Petition (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 5:47 PM IST

CBI Court on YS Bhaskar Reddy Petition: వివేకా హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్లపై నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకుంటామని కోరుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

'ఒక వైపు వైఎస్సార్ బిడ్డ - మరో వైపు వివేకా హత్య నిందితుడు - ఏవరికి ఓటు వేస్తారు?' - YS SHARMILA ELECTION speech

వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరికీ హైకోర్టు గతంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కడప వెళ్లొద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని, దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని షరతులు విధించింది. ఒకవేళ షరతులు ఉల్లంఘించినట్లు సీబీఐ భావిస్తే, కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయొచ్చని పేర్కొంది. దీంతో హైకోర్టు షరతుల దృష్ట్యా భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కడప వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకుసీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

షర్మిలపై కేసు పెట్టిన ఏపీ పోలీసులు- వివేకా హత్యపై మాటలే కారణమట! - case filed on ys sharmila

ABOUT THE AUTHOR

...view details