Deputy CM Bhatti Fires BRS Past Ruling :గత ప్రభుత్వంరాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసింది అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. భద్రాద్రిలో మంచినీటి పథకానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌తో కలిసి భట్టి పాల్గొన్నారు. మొదటగా కొత్తగూడెం పట్టణానికి అమృత పథకం కింద రూ.234 కోట్లతో మంచినీటి పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికీ పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పారని కానీ అవి మాటలకే పరిమితమయ్యాయని భట్టి పేర్కొన్నారు. వాళ్లు చెప్పింది చేసుంటే రూ.125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపడతామని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగూడెంలో 1.85 లక్షల మందికి నీళ్లివ్వాల్సిన అవసరం రాకపోయేది కదా అన్నారు.
రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలి : భట్టి - Deputy CM Bhatti on Annual Budget
"ప్రాధాన్యాల మేరకు ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో వెళ్తున్నాం. సీతారామ ప్రాజెక్టు చేపట్టి ట్రయల్ రన్ పూర్తిచేశాం. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి చూపెడతాం. ఆగస్టులోపే రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాం. గత ప్రభుత్వం మాదిరిగా దోపిడీ చేసి ప్రజలను అప్పుల పాలు చేయం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం. అభివృద్ధి చేస్తాం." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
ఖర్చు పెట్టిన పైసలు ఎక్కడికి పోయాయి? : ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ఉంటే రూ.42 వేల కోట్లు ఎక్కడికి పోయాయని మంత్రి భట్టి విక్రమార్క అడిగారు. ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచి నీళ్లు అందలేదన్న ఆయన గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని విమర్శించారు. థర్మల్ ప్రాజెక్టులు మొదలుపెడితే ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో ఐటీ హబ్ కావాలని కోరారన్న ఆయన దాని కోసం మంత్రితో మాట్లాడి మంజూరు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.
రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ స్టేషన్ - ఎన్నికల హామీని పూర్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం
నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి ఊరట - రూ.406 కోట్ల నిధులు విడుదల