ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం - బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు - Ministerial Reviews on Rains - MINISTERIAL REVIEWS ON RAINS

Ministers Orders to Officials in the Wake of Rains in AP: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మంత్రులు అప్రమత్తమయ్యారు. అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరి కొంత మంది క్షేత్రస్థాయిలో పర్యటించి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకున్న ముంపు గ్రామాల్లోని ప్రజలను తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ministerial_reviews_on_rains
ministerial_reviews_on_rains (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 3:54 PM IST

Updated : Jul 20, 2024, 7:11 PM IST

Ministers Orders to Officials in the Wake of Rains in AP:రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు అప్రమత్తమయ్యారు. అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చిక్కుకున్న ముంపు గ్రామాల్లోని ప్రజలను తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు.

Minister Vangalapudi Anitha:రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో ఫోనులో మాట్లాడి వర్షాల ప్రభావం, తాజా పరిస్థితులపై ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో 7 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపునకు ఆదేశించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సూచనతో వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రంగంలోకి దిగారు. చింతూరు ఏజెన్సీలో వరద సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని గర్బిణీలు, రోగులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Minister Achennaidu :రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తుండటంతో అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అన్నదాతలకు క్షేత్రస్థాయిలో సూచనలు అందించాలన్నారు. వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టాన్ని ప్రాథమిక స్థాయిలోనే అంచనా వేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్​ను మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించారు.

వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొడుతున్న వర్షాలు- అత్యధికంగా చింతూరులో 21సెం మీ - Rains in Andhra Pradesh 2024

Minister Gottipati Ravi:అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులతో రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు, సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షత ప్రాంతానికి తరలిస్తున్నారు.

Minister Nimmala Ramanaidu:ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అధికారులు, సిబ్బింది క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని సూచించారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర సామాగ్రిని ప్రజలకు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను, దీర్ఘవ్యాధిగ్రస్తులను గుర్తించి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

అంధకారంలో మత్స్యకారుల జీవితాలు - ఆశలన్నీ కూటమి ప్రభుత్వపైనే! - Fishermen Faced Problem

Minister Kolusu Parthasarathi:ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కుమ్మరి కుంట, మేడేపల్లి, రామవరం వరద ప్రాంతాలలో గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. వరద బాధితులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. వరద ప్రాంతాలు, కొట్టుకుపోయిన ఇళ్లు, పంట భూములను పరిశీలించారు. వరదలో నష్టపోయిన ఇల్లు, పంట వివరాలను సేకరించి పరిహారం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. పార్థసారథితో పాటుగా పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ లావణ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పర్యటించారు.

Minister Kandula Durgesh:భారీ వర్షాలు, వరదల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వరదల వల్ల నిడదవోలు మండలంలో 13 వేల ఎకరాలు ముంపునకు గురైందన్నారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. భారీ వర్షాలతో నష్టపోయినవారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఒకవైపు భారీ వర్షాలు - మరోవైపు తాగునీటి కష్టాలు - అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు - Severe Water Crisis in Kurnool

Minister Kollu Ravindra:భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గనులు, ఎక్సైజ్​ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. భారీగా కురుస్తున్న వర్షాలపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు డీకే బాలాజీ, సృజనతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఎగువ నుండి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని తెలిపారు. కాలువల్లో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Last Updated : Jul 20, 2024, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details