AP Legislative Council:రాష్ట్ర అప్పులు, ఖర్చులు, విద్యుత్ ఛార్జీల వంటి అంశాలపై మండలిలో వాడీవేడిగా చర్చ సాగింది. శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రులు సమాధానం ఇచ్చారు.
రాఘవరెడ్డి దురాగతాలపై చర్యలు: కడప విద్యాశాఖ మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డి దురాగతాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమిక విచారణలో అక్రమాలు నిర్ధారణ అయ్యాయన్న మంత్రి 45 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. రాఘవరెడ్డి అంశంపై మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, దువ్వారపు రామారావు, బి.తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు.
అప్పులపై హౌస్ కమిటీ:రాష్ట్ర అప్పులపై జరిగిన చర్చతో శాసనమండలి అట్టుడికింది. గత ప్రభుత్వం చట్టసభల పరిధిలోకి రాకుండా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. దీనిపై అభ్యంతరం తెలిపిన విపక్ష నేత బొత్స సత్యనారాయణ హౌస్ కమిటీ వేయాలని కోరారు. కమిటీలతో అధ్యయనం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి పయ్యావుల బదులిచ్చారు
వైఎస్సార్సీపీ పాపాల వల్లే బుడమేరుకు వరదలు:వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, పాపాల ఫలితంగానే బుడమేరుకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత టీడీపీ హయాంలో బుడమేరు ఆధునికీకరణ పనులు చేపట్టి 80 శాతం పూర్తిచేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించలేదని చెప్పారు. శాసనమండలిలో బుడమేరు వరదలు, సహాయక చర్యలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. భవిష్యత్తులో బుడమేరుకు వరదలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది : పవన్ కల్యాణ్
విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం: ట్రూ అప్ ఛార్జీల వసూలుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ వ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు. ట్రూఅప్ ఛార్జీలపై శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై పెను భారం వేసిందని అన్నారు. గత ప్రభుత్వం ఈఆర్సీకి పంపిన ప్రతిపాదనల వల్లే ట్రూ అప్ చార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. మంత్రి గొట్టిపాటి సమాధానం సంతృప్తికరంగా లేదంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
వాలంటీర్లను వైఎస్సార్సీపీ మాయం చేసింది:వాలంటీర్ల వ్యవస్థ మనుగడలోనే లేదని వారికి వేతనాలు చెల్లించాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాబోదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. వాలంటీర్లకు వేతనాల పెంపు హామీపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వాలంటీర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రెన్యూవల్ చేయలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చర్యల వల్లే వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ వారికి ఏదైనా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు సహృదయంతో సూచనలు చేశారని సభకు తెలిపారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం పూనుకున్నా ఆ వ్యవస్థను వైఎస్సార్సీపీ మాయం చేసిందని మంత్రి డోలా అన్నారు.
ఏపీలో 81 కొత్త బ్రాండ్లు, 47 అంతర్జాతీయ మద్యం బ్రాండ్లకు అనుమతి : కొల్లు రవీంద్ర
ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన చేద్దాం: సీఎం చంద్రబాబు