Minister Ponnam Prabhakar Sensational Comments: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు బదిలీల కోసం తన వద్దకు రావద్దని సూచించారు. ఈ రెండు విషయాలలో తనపై ఒత్తిడి తేవద్దని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల కోసమే కొన్ని వందల వేలమంది వస్తున్నారన్నారు. ఆర్టీసీకి సంబంధిత మంత్రినైనా బదిలీల విషయమై తానేమీ చేయలేనన్నారు. ఈ రెండు పనులు తప్ప శాసనసభ్యునిగా నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులు చేస్తానని మంత్రి వెల్లడించారు.
అందుకోసమైతే నా దగ్గరకు రావద్దు - మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు - MINISTER ON TRANSFERS
బదిలీల విషయంలో నేనేమీ చేయలేను - అభివృద్ధి పనులైతే ఓకే అన్న పొన్నం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2024, 6:01 PM IST
|Updated : Nov 7, 2024, 7:17 PM IST
రాష్ట్రంలో కుల సర్వేకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో కులగణన సర్వేను ఆయన పరిశీలించారు. రాహుల్ గాంధీ కులం కావాలంటే దేశవ్యాప్తంగా కుల సర్వే చేస్తే రాహుల్ గాంధీ కులం ఏంటో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వే పై అక్కసుతోనే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నరన్నారు. రాహుల్ గాంధీ కులం అడగడంలో బీజేపీకి ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం గట్ల నర్సింగపూర్‌లో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయని ఆరా తీశారు. కులగణన పై అధికారులకు సమగ్ర వివరాలు ఇవ్వాలని, సమాచారం గోప్యతగా ఉంటుందని స్థానికులకు సూచించారు.
బీఆర్ఎస్పై 'దీపావళి' బాంబ్ - మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు