ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్‌ అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గరలో ఉంది : లోకేశ్

జగన్‌ ఇంటి చుట్టూ కంచె వేసుకునేందుకు ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేశారని, ఆయన అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గర్లోనే ఉందని మంత్రి లోకేశ్ అన్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 1 hours ago

Minister Nara Lokesh on Jagan House Fencing
Minister Nara Lokesh on Jagan House Fencing (ETV Bharat)

Minister Nara Lokesh on Jagan House Fencing : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గర్లోనే ఉందంటూ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది. జగన్ గత ఐదేళ్లలో దోచేసిన వేలకోట్లు, సాక్షి మీడియాకి ధారపోసిన వందల కోట్లు, కోట్ల రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్‌లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి కంచె ఎత్తు ఇంకా పెంచే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్‌లో గుట్టలుగా నోట్ల కట్టలు జగన్ పోగేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు (Jagan House Fencing cost 13 CR) చేసిన జగన్‌, మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు చేస్తుంటాడని మండిపడ్డారు.

దేశ అధ్యక్షుల కంటే జగన్ రెడ్డికే ప్రాణహాని భయాలు! :జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు అయిన ఖర్చు జీఏడీ లెక్కల ప్రకారం 12.85 కోట్లని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ధ్వజమెత్తారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏ విధంగా వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో వాటికి నిదర్శనం నేడు ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్, రుషికొండ ప్యాలస్, రుషికొండ ప్యాలస్‌లోని బాత్ టబ్​ల నుంచి మసాజ్ టేబుళ్లు వరకు అన్ని ప్రజల సొమ్ముతోనే చేయించుకున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఇష్టానుసారం మింగటం, సొంత ఖజానాకు చేర్చుకోవటం, మిగిలింది తన విలాసాల కోసం ఖర్చు చేయడం, ఇది జగన్ రెడ్డి సీఎంగా చేసిన దినచర్య అని విమర్శించారు. రాష్ట్రపతి భవన్, ప్రధాని ఇంటి చుట్టూ కూడా ఇలాంటివి ఉండవన్న పట్టాభిరామ్‌.. దేశ అధ్యక్షులు కంటే జగన్ రెడ్డికి ప్రాణహాని భయాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు.

Last Updated : 1 hours ago

ABOUT THE AUTHOR

...view details