Minister Nadendla Manohar Fire on Jagan : జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా (PMFBY) కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని వెల్లడించారు. అర్థం లేని విమర్శలతో వైఎస్సార్సీపీ కాలక్షేపం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని వివరించారు. ఎక్కడ కష్టమొచ్చినా కూటమి సైనికులు ముందుంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అర్థం లేని విమర్శలతో వైఎస్సార్సీపీ కాలక్షేపం: మంత్రి నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar Fire on Jagan - NADENDLA MANOHAR FIRE ON JAGAN
Minister Nadendla Manohar Fire on Jagan : జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆయన ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 7:30 PM IST
ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో మీరూ భాగస్వాములు కావచ్చు అని నాదెండ్ల మనోహర్ జగన్‌కు సూచనలు చేశారు. నాయకుడు ఎలా ఉండాలో పవన్‌ను చూసి నేర్చుకోవాలని జగన్‌కు హితబోధ చేశారు. రాష్ట్రంలో ప్రతి పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళమిచ్చారని పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున సాయం చేశారని గుర్తు చేశారు. 74 వయసులో సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. గండ్లు పూడ్చి వాటర్ సీపేజ్ లేకుండా పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
కాకినాడ కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం- 51,427 మెట్రిక్ టన్నులు సీజ్ - ration rice exported