Lok Sabha Elections Campaign in Telangana 2024 : రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వం సమరశంఖం పూరించగా అభ్యర్థులు, వారికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం సాగిస్తున్నారు. అంబర్‌పేటలో జరిగిన హస్తం పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ హాజరయ్యారు.
Congress Lok Sabha Election Campaign 2024 :మేడ్చల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ (Congress Strategy on MP Elections) ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కొంపల్లి యాదిరెడ్డిబండలో ఏర్పాటు చేసిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, బల్మూరి వెంకట్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ హస్తం పార్టీ నియోజకవర్గ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై ఆమె విమర్శలు గుప్పించారు.
బీజేపీ మేనిఫెస్టోకి దిక్కులేదు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమాశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే సామెల్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి గెలుపు కోసం సమష్టిగా సాగాలని కోరారు. దేవుడి పేరుతో బీజేపీ బస్తీల్లో రాజకీయం చేస్తోందని ఇప్పటికీ ఆ పార్టీ మేనిఫెస్టోకి దిక్కులేదని కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన హస్తం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్, దేశాన్ని కమలం పార్టీ నాశనం చేశాయని ఆరోపించారు. పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని ఆయన కోరారు.
BRS Election Campaign 2024 :మరోవైపు పార్లమెంట్ ఎన్నికలుబీఆర్ఎస్‌కు (BRS Focus on Lok Sabha Polls) ప్రతిష్టాత్మకంగా మారటంతో చావోరేవో తేల్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో జరిగిన గులాబీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కరీంనగర్‌లో భారత్ రాష్ట్ర సమితిని ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
BJP Election Campaign 2024 :అటు లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలదళం (BJP Lok Sabha Election Campaign) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్‌షో నిర్వహించారు. హామీలు అమలుచేయకుండా 4నెలల్లోనే కాంగ్రెస్ చేతులెత్తేసిందన్న ఆయన, దేశంలో ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. చేవెళ్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాఆశీర్వాద సభ ముచ్చింతల్‌కు చేరుకుంది.