నేను ఘర్ వాపస్ కావాలని నిర్ణయించుకున్నాను - పదవులపై ఆశ లేదు : కె.కేశవరావు K.Keshava Rao Clarity on Joining Congress Party : తెలంగాణలో బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంటే, దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు పేర్కొన్నారు. అందుకే హస్తం పార్టీలోకి వెళ్తున్నానని వెల్లడించారు. దిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నామని, అతి త్వరలో తన కుమార్తె మేయర్ విజయలక్ష్మితో కలిసి సొంతగూటికి చేరుతున్నట్లు తెలిపారు. అవసరమైతే తన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి చేరతానని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే గతంలోనే రాజకీయల నుంచి తప్పుకోవాలని చూశానని, కొందరి సలహాతో ఇంకా పొలిటికల్ లీడర్‌గా ఉన్నానని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు కొంత వరకు భ్రష్ఠు పట్టాయన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం గతంలో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరానన్న కేకే, 13 ఏళ్ల తీర్థయాత్ర చేశాక ఇంటికి వెళ్లినట్లు కాంగ్రెస్‌కు వెళుతున్నానని వివరించారు. ఘర్ వాపసీకి డిసైడ్ అయ్యానని, ఇదే అంశం కేసీఆర్‌ను కలిసి చెబితే, కొద్దిరోజులు ఆగాల్సింది అన్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇండియా కూటమిలో చేరాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చానన్నారు.
కడియం శ్రీహరితో కాంగ్రెస్ నేతల భేటీ - సాయంత్రం హస్తం గూటికి తండ్రీకుమార్తె!
తీర్థయాత్ర చేశాక ఇంటికి వెళ్లినట్లే కాంగ్రెస్‌కు వెళ్తా. ఘర్ వాపస్‌కు నిర్ణయం తీసుకున్నా. కేసీఆర్‌కు నా నిర్ణయం పట్ల బాధే ఉంది. కొద్దిరోజులు ఆగి ఉండాల్సిందని కేసీఆర్ చెప్పారు. నా కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నందునే ఆ పార్టీలోకి వెళ్తున్నా. ఇండియా కూటమిలో చేరాలని కేసీఆర్‌కు సలహా ఇచ్చాను. త్వరలో దిల్లీ పెద్దలతో మాట్లాడాక కాంగ్రెస్‌లో చేరుతా. అవసరమైతే రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తా. - కేశవరావు, రాజ్యసభ ఎంపీ
సీఎం రేవంత్ రెడ్డితో కేకే మర్యాదపూర్వక భేటీ - ఇక చేరికే తరువాయి
మరోవైపు బీఆర్ఎస్లో తనకు మంచి అవకాశం, గౌరవం ఇచ్చారని కేశవరావు పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు మేధావులని, వాళ్లు బాగా కష్టపడతారని కితాబిచ్చారు. కేసీఆర్ తనకు రాజ్యసభ మెంబర్‌గా అవకాశం ఇచ్చారని, మొదటిసారి కూడా కాంగ్రెస్ సపోర్ట్‌తోనే గెలిచానని గుర్తు చేసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగంపైనా కేసీఆర్‌తో చర్చించామన్న ఆయన, కవిత అరెస్ట్‌పైనా మాట్లాడినట్లు స్పష్టం చేశారు.
ఇట్స్ అఫీషియల్ - కాంగ్రెస్‌లోకి కేకే, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి