Janasena MLA Candidates List : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు రెండు పార్టీల తరఫున తొలి జాబితా విడుదల చేశారు. మొత్తం 175 స్థానాలకు గానూ ఫస్ట్ లిస్ట్‌లోనే 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ బరిలో దిగుతుండగా, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సీట్లపైనా ఇరుపార్టీల నేతలు ఓ క్లారిటీ ఇచ్చారు. 25 ఎంపీ స్థానాల్లో 3 చోట్ల జనసేన పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
*జనసేన అభ్యర్థులు*
- తెనాలి - నాదెండ్ల మనోహర్
- నెల్లిమర్ల - లోకం మాధవి
- అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
- కాకినాడ రూరల్ - పంతం నానాజీ
- రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే మా కలయిక :రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన కలయిక జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ కూటమికి బీజేపీ శుభాశీస్సులు ఉన్నాయని తెలుపుతూ జనసేన తరఫున ఐదుగురు శాసనసభ అభ్యర్థులను ప్రకటించారు.
"టీడీపీ అభ్యర్థులను నేను ఎంపిక చేస్తా. జనసేన అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఎంపిక చేస్తారు. మొదటి విడత 94 సీట్లకు అభ్యర్థులను జాబితాను విడుదల చేస్తున్నాం. జనసేన, టీడీపీ మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు జరిపాం. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో తెలుగుదేశం - జనసేన ఆశావహులు ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. గొరంట్ల బుచ్చయ్య, దుర్గేశ్‌లో ఎవరో ఒకరికి రాజమండ్రిలో మరొకరు వేరే చోట పోటీ చేస్తారు. వైసీపీ తరపున దోపిడీ దారులు అభ్యర్థులుగా నిలబడుతున్నారు." - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత