Jagan Warning to Police : విధి బలీయమైనది. మనమే బలహీనులం. ఈ విషయం ఒక్కొక్కరికి ఒక్కో సందర్భంలో జ్ఞానోదయం అవుతుంది. ఐదేళ్లు అధికారంలో విర్రవీగిన జగన్.. జనం కర్రుకాల్చి వాత పెట్టినా ఆ విషయాన్ని ఇంకా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేకున్నా, కారులో నేరుగా అసెంబ్లీకి వచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించినా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో సీఎం హోదాలో నలుపు రంగు వాసనే పడని జగన్.. ఇవాళ అదే రంగు కండువాలతో అసెంబ్లీకి రావడం విధి బలీయమైనదన్న వాస్తవాన్ని గుర్తు చేస్తోంది.
అసెంబ్లీలో ఆ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ - ఏం మాట్లాడుకున్నారంటే? - ys jagan raghu rama conversation
అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఫేక్ పాలిటిక్స్‌ను నమ్ముకున్న జగన్ అసెంబ్లీ ఆవరణ సాక్షిగా పోలీసులను బెదిరించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ప్రజలు చీ కొట్టినా జగన్ మారలేదని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా నల్ల కండువాలు ధరించి వచ్చిన జగన్ అసెంబ్లీ ఆవరణలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లోపలకి ప్లకార్డులు తీసుకువెళ్లడాన్ని పోలీసులు అడ్డుకోగా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఎమ్మెల్యేల దగ్గర్నుంచి, ఎమ్మెల్సీల దగ్గర్నుంచి ప్లకార్డులు గుంజుకుని, లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపేసే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో! ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీదున్న సింహాలకు అర్థమేంటో తెలుసా? అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు... ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి"