YSRCP Leaders Illegal mining : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, కలెక్టర్, భూగర్భగనులు, రెవెన్యూ, నిఘా అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీకి చెందిన కొంతమంది గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇన్నాళ్లు కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల్ని దోచుకున్న అక్రమార్కులు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల భూముల మీద కన్నేశారు. అసైన్డ్ భూముల్లో చేపల చెరువు పేరిట మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తమ భూముల్లో మట్టి దందా ఏంటని ప్రశ్నిస్తే తిరిగి వారిపైనే కేసులు పెడతామని హెచ్చరించే స్థాయికి అక్రమార్కుల ఆగడాలు చేరాయి.
Soil mafia in Mangalagiri: "పర్మిషన్ ఏం లేదండీ..! తవ్వుకోమని ఎమ్మెల్యే చెప్పారండీ"
ఇన్నాళ్లూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులు దోపిడీ చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్ వచ్చినా లెక్కచేయకుండా అరాచకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో అధికారం అండగా ఉందని ధీమాతో మట్టిమాఫియా చెలరేగిపోతోంది. మేడికొండూరు మండలం పేరేచర్ల కొండల్లో పట్టా, అసైన్డుభూముల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొండలచెరువులోని భూముల్లో నాణ్యమైన ఎర్రమట్టిని రాత్రివేళ తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. అక్రమార్కులకు అధికార పార్టీ నేతలు అండగా ఉండటంతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇక్కడే నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన పట్టాభూములు ఉండగా అందులోనూ తవ్వకాలు చేస్తున్నారు. దీనిని గుర్తించిన విద్యాసంస్థల కమిటీ జిల్లా కలెక్టర్ నుంచి భూగర్భగనులు, రెవెన్యూ, నిఘా విభాగాలకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ రాత్రివేళ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
YSRCP Leaders Illegal Mining అర్ధరాత్రి గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న స్థానికులు