High Court hearing on Konaseema Violence:కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు మార్పును నిరసిస్తూ జరిగిన అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కేసుల ఉపసంహరణ చేస్తూ ఇచ్చిన జీవో పై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబురావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పిటిషనర్ తరుపున వాదనలు వినిపించారు.
కోర్టులో ఇరుపక్షాల వాదనలు: కేసులు ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ వాదించారు. కేసులు ఉపసంహరించుకోమని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు ఇవ్వటం సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కి వ్యతిరేకమంటూ వాదనలు వినిపించారు. కేసులు ఉపసంహరించుకోవడం వల్ల చట్టం చులకన అయిపోతుంది అంటూ వాదనలు వినిపించారు. జీవోను అనుసరించి ఇప్పటివరకు ఏ విధమైన ఉపసంహరణ పిటిషన్ క్రింద కోర్టులో దాఖలు చేయలేదంటూ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేసులు ఉపసంహరించే విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశాలు ప్రామాణికంగా తీసుకోవాలి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.
19న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ - ప్రజలంతా కదలి రావాలి: సీఎం జగన్
జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబురావు ఈ మేరకు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మొత్తం 6 ఎఫ్‌ఐఆర్‌ల కేసుల ఉపసంహరణకు, రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 20న జీవో జారీ చేసింది. ఆ జీఓను నిలిపి వేయాలని జంగా బాబురావు న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోను కొట్టేయాలని కోర్టును కోరారు. తన పిటిషన్ లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ, డీఎస్పీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2022 మే నెలలో చోటు చేసుకున్న ఈ హింసాత్మక ఘటనలో, బాధ్యులుగా పేర్కొంటూ వందల మందిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషనర్ బాబురావు పేర్కొన్నారు.
కోనసీమ జిల్లా.. ఇకపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ
ఇదీ జరిగింది: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏర్పాటైన కోనసీమ జిల్లాకు స్థానికుల ఒత్తిడితో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం హింసకు దారి తీసింది. అల్లర్లలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులపై కేసులు పెట్టింది. ఆ తరువాత రాజకీయ కారణాలు చూపి ఆ కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో కేసుల ఎత్తివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేయడంపై న్యాయపోరాటం చేస్తాం : జడ శ్రావణ్ కుమార్